Rachel Teaser: వామ్మో.. హానీరోజ్ ఏంటి ఈ రేంజ్‌లో రెచ్చిపోయింది

ABN , Publish Date - Jun 17 , 2024 | 08:27 PM

హనీ రోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న రేచెల్ టీజర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా, సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు.

Rachel Teaser: వామ్మో.. హానీరోజ్ ఏంటి ఈ రేంజ్‌లో రెచ్చిపోయింది
rachel

హనీ రోజ్ (Honey Rose) లీడ్ రోల్ లో నటిస్తున్న రేచెల్ (Rachel) టీజర్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా, సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా (Anandhini Bala) దర్శకత్వం వహించారు.

యాక్టింగ్ ఫీల్డ్ లో హనీ రోజ్‌కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్‌ చూస్తే అర్ధమౌతోంది. వైలెన్స్, బ్లడ్ షెడ్ తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్ హింట్ ఇస్తోంది.

Honey-Rose.jpg

ఈ చిత్రంలో బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టిల్, జోజి, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Honey-Rose-2.jpg

ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రాన్ని బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు. రాహుల్ మణప్పట్టు కథను అందించగా, స్క్రీన్ ప్లే రాహుల్ మణప్పట్టు, అబ్రిడ్ షైన్ అందించారు.

Updated Date - Jun 18 , 2024 | 02:48 PM