Arya: ఆర్యతో.. నిఖిలా విమల్‌

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:23 PM

గ‌త సంవ‌త్స‌రం ఆర్జే బాలాజీ హీరోగా ర‌న్ బేబీ ర‌న్ సినిమాను తెర‌క‌క్కించి హిట్ కొట్టిన జియ‌న్ కృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్య హీరోగా ఓ చిత్రం ప‌ట్టాలెక్కింది.

arya

గ‌త సంవ‌త్స‌రం ఆర్జే బాలాజీ హీరోగా ర‌న్ బేబీ ర‌న్ సినిమాను తెర‌క‌క్కించి హిట్ కొట్టిన జియ‌న్ కృష్ణ‌కుమార్ (Jiyen Krishnakumar) ద‌ర్శ‌క‌త్వంలో ఆర్య (Arya) హీరోగా ఓ చిత్రం ప‌ట్టాలెక్కింది. ఈ సినిమాలో ఆర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తోండ‌గా మ‌ల‌యాళ బ్యూటీ తొలిసారి ఆర్య‌ సరసన క‌థానాయిక‌గా ఎంపికైంది.

GT0VLprXgAAM_1t.jpeg

పా.రంజిత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సర్పట్టా పరంబరై’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత హీరో ఆర్య (Arya) కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆర్య‌ ‘మిస్టర్‌ ఎక్స్‌’ మూవీలో నటిస్తుండ‌గా ఈ మూవీ తర్వాత తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందే ద్విభాషా చిత్రంలో నటించనున్నారు.


GUcL2O6XwAAweIn.jpeg

మలయాళంలో ప్రముఖ కథారచయిత మురళిగోపి ఈ చిత్రానికి కథ సమకూర్చారు. ఈ ప్రాజెక్టు కోసం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. ఇందులో భాగంగా మ‌ల‌యాళంలో వ‌రుస చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్న‌ హీరోయిన్‌గా నిఖిలా విమల్ (Nikhila Vimal)ను ఎంపిక చేయగా, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

GUcL2PAXIAAN5eV.jpeg

Updated Date - Aug 14 , 2024 | 03:23 PM