Malavika Mohanan: ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో తెలియడం లేదు

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:32 AM

కోల్‌కతా వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనపై హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) స్పందించారు. ఈ ఘటన తననెంతో బాధ పెట్టిందని విచారం వ్యక్తం చేశారు.

కోల్‌కతా వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనపై హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) స్పందించారు. ఈ ఘటన తననెంతో బాధ పెట్టిందని విచారం వ్యక్తం చేశారు. మహిళల భద్రత గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో చోటు చేసుకున్నప్పుడు మూలాలను కనుగొని వాటికి అడ్డుకట్ట వేయాలని ఆమె అన్నారు. ‘‘ఇటీవల మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు చూస్తుంటే హృదయం ముక్కలవుతోంది. నేను ఓ ప్రమోషన్‌లో పాల్గొని మహిళా సాధికారత (women safety) గురించి మాట్లాడుతున్న సమయంలో ఈ వార్త తెలిసింది. షాక్‌కు గురయ్యాను. ఇలాంటి ఘటనలు మహిళల్ని నిస్సాహయుల్ని చేస్తున్నాయి. ఎలా.. ఎక్కడ ఎటు నుంచి ఆపద వస్తుందో తెలియడం లేదు. చాలా మందికోల్‌కతా వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనపై హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) స్పందించారు. ఈ ఘటన తననెంతో బాధ పెట్టిందని విచారం వ్యక్తం చేశారు. స్త్రీలు ఇలాంటి ఘోరాల గురించి బయటకు చెప్పడానికి కూడా ఆలోచిస్తుంటారు. వారిపై జరిగిన దాడిని రహస్యంగా ఉంచుతున్నారు. చర్చించాలనుకుంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి’’ అని అన్నారు.

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య విద్య నియంత్రణ సంస్థ జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని వైద్యకళాశాలలు, వసతిగృహాల్లో వారి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తూ వైద్య కళాశాలకు అడ్వయిజరీ జారీ చేసింది.

Updated Date - Aug 28 , 2024 | 11:33 AM