Malavika Mohanan: ఆ సినిమా దెబ్బ‌కు.. ఐదారుగురు వైద్యులను క‌ల‌వాల్సి వ‌చ్చింది

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:16 AM

పా.రంజిత్‌ దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్‌’. ఇందులో నటించడం వల్ల చర్మ వ్యాధుల బారిన పడినట్టు మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తెలిపారు. ఇంకా..

Malavika Mohanan

పా.రంజిత్‌ దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్ ( Chiyaan Vikram) హీరోగా తెరకెక్కిన ‘తంగలాన్‌’ (Thangalaan) చిత్రంలో నటించడం వల్ల చర్మ వ్యాధుల బారిన పడినట్టు మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) తెలిపారు.

Thangalan

బడా నిర్మాత కేఈ ఙ్ఞానవేల్‌ రాజా.. దర్శకుడు పా.రంజిత్‌( pa.ranjith) కు చెందిన నీలం ప్రొడక్షన్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Thangalan

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ బంగారు గనుల్లో పనిచేసే తమిళ కూలీల ఇతివృత్తంతో పీరియాడికల్‌ మూవీగా దర్శకుడు పా.రంజిత్‌ రూపొందించారు.

Malavika Mohanan

ఈ సినిమా నిర్మాణంలో ఎదురైన అనుభవాలను మాళవిక మోహనన్ (Malavika Mohanan) తాజాగా వివరించారు.

Malavika Mohanan

‘ఈ మూవీలో వైవిధ్యభరితమైన పాత్రలో నటించాను. వేషధారణ కూడా అలాగే ఉంటుంది. ప్రతి రోజూ మేకప్‌ వేసుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టేది. ఎర్రటి ఎండల్లో ఈ సినిమా షూటింగ్‌ జరిగింది.


Malavika Mohanan

సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే నేత్ర సమస్యలతో పాటు చర్మవ్యాధులతో ఇబ్బంది పడ్డాను. దీనికి కారణం.. మండిపోయే ఎండలు. పాత్ర కోసం వాడిన దుస్తులు. వేసిన మేకప్‌. దాదాపు ఐదారు మంది స్కిన్‌ స్పెషలిస్టుల (వైద్యులు)ను సంప్రదించాల్సి వచ్చింది’ అంటూ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.

Malavika Mohanan

Updated Date - Jul 30 , 2024 | 11:38 AM