R Madhavan: అలా చేయడం నాకు, నా భార్యకు ఇష్టం లేదు

ABN , Publish Date - Mar 16 , 2024 | 08:26 PM

హీరో మాధవన్ తన కుమారుడిని ఇతర స్టార్స్‌ పిల్లలతో పోల్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ

R Madhavan:  అలా చేయడం నాకు, నా భార్యకు ఇష్టం లేదు


హీరో మాధవన్ (Madhavan) తన కుమారుడిని ఇతర స్టార్స్‌ పిల్లలతో పోల్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘‘వేదాంత్‌ (Vedhanth) దేశంలో ఉన్న ప్రముఖుల్లో ఒకరు కాదు. కేవలం సెలబ్రిటీ కుమారుడు కావడంతో అతని గురించి తెలుసుకోవడంపై శ్రద్థ చూపిస్తున్నారు. కానీ, అతనిని ఇతర సెలబ్రిటీ పిల్లలతో పోల్చడం నాకు నా భార్య సరితకు ఇష్టం లేదు. ఇప్పటివరకూ వేదాంత్‌ తన టాలెంట్‌తోనే విజయం సాధించాడు.  ఒక నటుడి కుమారుడు జాతీయ స్థాయిలో పతకాలు అందుకున్నాడు. అది అంత తేలికైన విషయం కాదు. సోషల్‌ మీడియాలో అతనిపై వచ్చే మీమ్స్‌ గురించి మేం పట్టించుకోవడం లేదు. మీమ్స్‌ కారణంగా ఎదుటివారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని వాటిని సృష్టించేవారు తెలుసుకోలేకపోతున్నారు’’ అని మాధవన అన్నారు. అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటించిన ‘షైతాన్‌’ చిత్రంలో మాధవన్‌ నెగిటివ్‌ రోల్‌ చేశారు. హారర్‌ థ్రిల్లర్‌గా వికాశ్‌ బాల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జ్యోతిక కీలక పాత్ర పోషించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ  చిత్రం. 

Updated Date - Mar 16 , 2024 | 09:05 PM