Mohanlal: లూసిఫర్ 2 పూర్తి.. మోహన్‌లాల్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Dec 01 , 2024 | 08:21 PM
'లూసిఫర్'కు కొనసాగింపుగా ‘లూసిఫర్2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్‌లాల్ పోస్ట్ పెట్టారు.
మోహన్‌లాల్ (Mohan Lal) కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘లూసిఫర్2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’(L2: Empuraan) రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్‌లాల్ పోస్ట్ పెట్టారు. ‘‘సినిమా చిత్రీకరణ ముగిసింది. (lucifer 2)
14 నెలల సమయం..
ఎనిమిది రాష్ట్రాలు,
యూఎస్, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాలు..
ఇదొక అద్భుతమైన ప్రయాణం.
ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేేస సృజనాత్మకత పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్ర్కీన్ ప్లేతో ఈ కథకు ప్రాణం పోసిన మురళీ గోపీ, మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. నటీనటులు, టెక్నికల్ టీమ్ సమష్టి సహకారంతోనే మేము దీనిని సాధించగలిగాం. మమ్మల్ని ఎంతగానో ఆరాధించే అభిమానుల ప్రేమే.. మాలో స్ఫూర్తి పెంచింది. మరెన్నో విశేషాలు త్వరలో వెలువడనున్నాయి’’ అని పేర్కొన్నారు.
‘లూసిఫర్’కు ప్రీక్వెల్ కమ్ సీక్వెల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. పృథ్వీరాజ్ సుకుమార్, మంజు వారియర్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.