Katrina Kaif Review: సేతుపతి సినిమాకు బాలీవుడ్ బ్యూటీ ప్రశంసలు!
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:45 AM
విజయ్ సేతుపతి (Vijay sethupati) ప్రధాన పాత్ర పోషించిన 'మహారాజ'(Maharaja)చిత్రంపై బాలీవుడ్ నటి కట్రీనా కైఫ్ Katrina Kaif)రివ్యూ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రాన్ని కట్రీనా వీక్షించారు.
విజయ్ సేతుపతి (Vijay sethupati) ప్రధాన పాత్ర పోషించిన 'మహారాజ'(Maharaja)చిత్రంపై బాలీవుడ్ నటి కట్రీనా కైఫ్ Katrina Kaif)రివ్యూ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రాన్ని కట్రీనా వీక్షించారు. సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు. ఈ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. ‘‘వాట్ ఏ ఫిల్మ్.. సినిమా చాలా బాగుంది. కథను తెరకెక్కించిన విధానం అత్యద్భుతంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ను చూసి చిత్రబృందం ఆనందం వ్యక్తంచేసింది. విజయ్ సేతుపతి - కత్రినాకేౖఫ్ గతంలో ‘మేరీ క్రిస్మస్’ కోసం కలిసి పని చేశారు. సేతుపతి నటన అంటే తనకెంతో ఇష్టమని.. ఆయన అద్భుతమైన, అతని సింప్లిసిటీ తనకెంతో నచ్చుతుందన్నాని తెలిపారు. విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రమిది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. (katrina kaif Review)
కథ:
మహారాజా (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. ఒక ప్రమాదంలో భార్యను కోల్పోతాడు. అతనికంటూ మిగిలిన ఒకే తోడు కూతురు జ్యోతి. తను ఆ బిడ్డతోనే కలిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. మహారాజా ఓరోజు ఒంటి నిండా గాయాలతో పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ముగ్గురు అగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని.. ఈ క్రమంలోనే తమ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లిపోయారని.. ఎలాగైనా ఆ లక్ష్మిని వెతికి పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మరి మహారాజా చెప్పిన ఆ లక్ష్మి ఎవరు? అతని ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు? అసలు మహారాజాపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు ఎవరు? వాళ్లకు అతనికి ఉన్న గొడవలు ఏంటి? అన్న ఆసక్తికర అంశాలో ఈ సినిమా రూపొందింది.