Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్
ABN , Publish Date - Apr 04 , 2024 | 09:51 AM
గతంలో విడుదలై ఘన విజయం సాధించిన అనేక చిత్రాలను డిజిటల్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలోనే హీరో కార్తీ, తమన్నా జంటగా నటించిన ‘పయ్యా’ చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని 4K వెర్షన్‌లో ఈ నెల 11న భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఈ మధ్యకాలంలో.. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన అనేక చిత్రాలను డిజిటల్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలోనే హీరో కార్తీ (Karthi), తమన్నా (Tamannaah) జంటగా నటించిన ‘పయ్యా’ (Paiyaa) చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఎన్.లింగుస్వామి (N Lingusamy) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని 4K వెర్షన్‌లో ఈ నెల 11న భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చేశారు.
*Chiranjeevi: జారిపడినా డ్యాన్స్ ఆపలేదు, నాగపాములా ఆడుతూనే ఉన్నా! అప్పుడు మహానటి ఏమన్నారంటే?
ఈ చిత్ర రీ రిలీజ్ విషయమై హీరో కార్తీ మాట్లాడుతూ... ‘పరుత్తివీరన్’ చిత్రంలో ఒకే ఒక్క పంచె, చొక్కాలో కనిపించిన నేను... ‘పయ్యా’లో రంగురంగుల దుస్తుల్లో కనిపించాను. దర్శకుడు లింగుస్వామి నన్ను అలా చూపించారు. ఇందులో తమన్నా బ్యూటీఫుల్‌గా కనిపించారు. యువన్ పాటలు మరో అద్భుతం. అందుకే తొలిసారి విడుదలైనప్పుడే ఈ సినిమా ఎంతో ఆదరణను పొందింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు వినబడుతూనే ఉంటాయంటే.. యువన్ ఎంతగా ప్రాణం పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. తొలిసారి విడుదలైనపుడు ఈ సినిమాకు ఎటువంటి ఆదరణ అయితే లభించిందో.. రీ రిలీజ్ రోజు కూడా అలాగే లభిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. (Paiyaa Ready to Re Release)
దర్శకుడు ఎన్.లింగుస్వామి మాట్లాడుతూ... ‘పరుత్తివీరన్’లో మొరటోడుగా కనిపించిన కార్తీ.. ఈ సినిమాలో పూర్తిగా సిటీ చాక్లెట్ బాయ్‌గా కనిపించి అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమాకు యువన్ సంగీతంతో ప్రాణం పోశారు. తప్పకుండా రీ రిలీజ్‌లో కూడా మంచి సక్సెస్‌ను ఈ సినిమా సాధిస్తుందనే నమ్మకముందని తెలిపారు. కాగా, 2010లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ సాధించింది. ఈ నెల 11న రీ రిలీజ్ చేసేందుకు నిర్మాత ఎన్. సుభాష్ చంద్రబోస్ (N Subhash Chandrabose) సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ‘ఆవారా’గా ఈ చిత్రం విడుదలైంది.
ఇవి కూడా చదవండి:
====================
*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు
******************************
*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు
***********************