Siva Rajkumar: శివ రాజ్‌కుమార్ హీరోగా.. కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీ

ABN , Publish Date - Jun 23 , 2024 | 05:09 PM

క‌న్న‌డ‌, తెలుగు నాట ఓ ఇంట్రెస్టింగ్ సినిమా ప‌ట్టాలెక్కింది. సూప‌ర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా క‌న్న‌డ, తెలుగు బై లింగ్వ‌ల్‌గా ఓ చిత్రం తెర‌కెక్కనుంది. శ‌నివారం (జూన్ 22) శివ‌రాజ్ కుమార్ సతీమ‌ణి శ్రీమతి గీత పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Siva Rajkumar: శివ రాజ్‌కుమార్ హీరోగా.. కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీ
Siva Rajkumar

క‌న్న‌డ‌, తెలుగు నాట ఓ ఇంట్రెస్టింగ్ సినిమా ప‌ట్టాలెక్కింది. సూప‌ర్ స్టార్ శివరాజ్ కుమార్ (DrShivarajKumar ) హీరోగా క‌న్న‌డ, తెలుగు బై లింగ్వ‌ల్‌గా ఓ చిత్రం తెర‌కెక్కనుంది. ఇప్ప‌టికే బ‌జ‌రంగీ, వేధ , తాజాగా జైల‌ర్ సినిమాల‌తో తెలుగు నాట కూడా మంచి గుర్తింపును ద‌క్కించుకున్న శివ రాజ్‌కుమార్ ఫ‌స్ట్ టైం తెలుగు బై లింగ్వ‌ల్ సినిమాలో న‌టిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెలకొంది.

ఈ సినిమాకు కార్తీక్ అద్వైత్ (Karthik Adwait) దర్శకత్వం వ‌హించ‌నుండ‌గా పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్నారు. శ‌నివారం (జూన్ 22) శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శివ రాజ్‌కుమార్ త‌దుప‌రి చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా శివ‌రాజ్ కుమార్ సతీమ‌ణి శ్రీమతి గీత (Geetha Shivarajkumar)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.


Shiva Rajkumar

ఇదిలాఉండగా గ‌తంలో త‌మిళంలో విక్రమ్ ప్రభుతో 'పాయుమ్ ఒలి నీ యెనక్కు' (Paayum Oli Nee Yenakku)చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తీక్ అద్వైత్ త‌న రెండో చిత్రంగా ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ ప్రాజెక్ట్‌తో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తవ‌గా శివరాజ్ కుమార్‌ని కంప్లీట్‌గా కొత్త లుక్, క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయ‌నున్నారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎ.జె శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ మూవీ ఫీషియల్ లాంచ్ వేడుక ఆగస్ట్‌లో జ‌రుగ‌నుండ‌గా షూట్‌ను ఫార్మల్ గా ప్రారంభించారు. తెలుగులో అమృత‌రామ‌మ్‌, ఒక్క‌డు మిగిలాడు, మ‌ద‌రాసి గ్యాంగ్‌ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత ఎస్ ఎన్ రెడ్డి ఈ బైలింగ్వల్ వెంచర్ కోసం సుధీర్ పి.తో కొలబరేట్ అవుతున్నారు. SN రెడ్డి రీసెంట్ ప్రాజెక్ట్ రీసెంట్‌గా స‌త్య‌దేవ్‌తో చేసిన‌ జీబ్రా చిత్రం తెలుగు, కన్నడ రెండింటిలోనూ విడుదల కానుంది.

Updated Date - Jun 23 , 2024 | 05:09 PM