Max Teaser: టీజ‌ర్‌తోనే చించేశాడుగా.. సుదీప్ ‘మాక్స్’లో సునీల్ కీ రోల్‌

ABN , Publish Date - Jul 16 , 2024 | 06:30 PM

దాదాపు రెండు సంవ‌త్స‌రాల గ్యాప్ అనంత‌రం విక్రాంత్ రోనా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చిత్రం తర్వాత సుదీప్ నటించిన చిత్రం మ్యాక్స్. తాజాగా టీజ‌ర్‌ విడుద‌ల చేయ‌గా విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

sudeep

దాదాపు రెండు సంవ‌త్స‌రాల గ్యాప్ అనంత‌రం విక్రాంత్ రోనా (Vikrant Rona) వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చిత్రం తర్వాత కన్నడ సూపర్ స్టార్, అభినయ చక్రవర్తి బాద్‌షా కిచ్చా సుదీప్ (Kiccha Sudeepa) నటించిన చిత్రం మ్యాక్స్ (Max). శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈచిత్రం టీజ‌ర్‌ను తాజాగా మంగ‌ళ‌వారం (జూలై 16) విడుద‌ల చేయ‌గా సుదీప్ అభిమానుల‌ను, సినీ ల‌వ‌ర్స్‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

sudeep

యాక్షన్ థ్రిల్ల‌ర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈచిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌క త‌మిళ నిర్మాణ సంస్థ వీ క్రియేష‌న్స్ (V Creations) బ్యాన‌ర్‌పై కలైపులి ఎస్ థానుతో క‌లిసి సుధీప్ ఈ సినిమాను నిర్మించ‌గా విజ‌య్ కార్తికేయ (Vijay Karthikeyaa) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ (Varalaxmi Sarathkumar), సంయుక్త (Samyukta Hornad), సుకృత (Sukrutha Wagle) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ చిత్రానికి సంగీతం అందించారు. పాన్-ఇండియన్ స్థాయిలో సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగు న‌టులు సునీల్, ప్ర‌భాక‌ర్‌ కీ రోల్స్ పోషిస్తుండ‌డం విశేషం


sudeep

కాస్త విరామం త‌ర్వాత సుదీప్ (Kiccha Sudeepa) న‌టించిన మూవీ విడుద‌ల కానండ‌డం, అదీ కూడా మాస్ అవతార్‌లో కనిపించ‌నుండ‌డంతో ఇప్పటికే ఈ మాక్స్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాక టీజ‌ర్‌లో కిచ్చా సుదీప్ డెమి-గాడ్ లుక్ అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది. మాస్, యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకునేలా సినిమాను తీయబోతోన్నారని మ్యాక్స్ (Max) టీజర్ చూస్తేనే తెలుస్తోంది.

Updated Date - Jul 16 , 2024 | 06:30 PM