Kamal Haasan: అవన్నీ ఊహాగానాలే.. అసలు ట్విస్ట్ ఏంటంటే!
ABN , Publish Date - Jun 29 , 2024 | 04:22 PM
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
కమల్‌హాసన్ (Kamal haasan) హీరోగా శంకర్ (Shankar)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ లో బిజీగా ఉంది. తాజాగా కమల్‌హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి ట్విస్ట్‌ను రివీల్ చేశారు.
‘‘ఇండియన్ 2’ ట్రైలర్ వచ్చినప్పటినుంచి సోషల్ మీడియాలో రకరకాల కథలు కనిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులందరినీ సిద్థార్థ్ చంపేస్తాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు సేనాపతి గెటప్ గురించి కథనాలు రాసుకొస్తున్నారు. ఇలాంటి ఆసక్తికర కథలు నేను చాలానే చూశాను. అయితే ఆ కథలేవీ నిజం కావు. ఈ సినిమా కథను ఎవరూ ఊహించలేకపోయారు. అందుకు నేను సంతోషిస్తున్నాను’ అని అన్నారు. ఇక ‘ఇండియన్ 3’లో సేనాపతి తండ్రి పాత్ర కూడా తెరపై కనిపిస్తుందని కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్య?ని చేశారు. దీంతో పార్ట్ 2కు ప్రీక్వెల్‌గా పార్ట్ 3 తెరకెక్కుతుందేమోనని కొందరు అనుకుంటున్నారు.
1996లో శంకర్ సృష్టించిన సంచలనం 'భారతీయుడు' చిత్రం. అందులో సేనాపతి పాత్రలో కమల్ ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి సీక్వెల్‌గా 'బారతీయుడు2’తో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సిద్థార్థ్, కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రధారులు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ చిత్రం విడుదలైన వెంటనే మూడోపార్టుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి టీమ్ సిద్ధంగా ఉందని మేకర్స్ చెబుతున్నారు.