Kamal Haasan - Biggboss : సినిమాల కమిట్‌మెంట్స్‌ వల్లే.. మరి నెక్ట్స్‌ ఎవరు?

ABN , Publish Date - Aug 06 , 2024 | 05:26 PM

విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan).. తమిళ బిగ్‌ బాస్‌ షో (Biggboss tamil show) నుంచి తప్పుకొన్నారు. తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు

విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan).. తమిళ బిగ్‌ బాస్‌ షో (Biggboss tamil show) నుంచి తప్పుకొన్నారు. తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పారు. ‘ఏడేళ్ల క్రితం మొదలైన మా ప్రయాణంలో చిన్న విరామం. సినిమా కమిట్‌మెంట్స్‌ వల్ల రాబోయే బిగ్‌బాస్‌ సీజన్‌కి హోస్టింగ్‌ చేయట్లేదు. ఈ విషయాన్ని చాలా బాధతో చెబుతున్నా. ఈ షో ద్వారా ఇంటింటికీ చేరువైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అలా బిగ్‌బాస్‌ తమిళ షోని భారతీయ టీవీ చరిత్రలోనే వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌గా నిలిపారు. హోస్ట్‌గా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. ఈ క్రమంలోనే భాగమైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు’ అని కమల్‌ హాసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇటీవల ‘కల్కి’లో విలన్‌గా ఆకట్టుకున్న కమల్‌.. ‘భారతీయుడు 2’తో హీరోగా పరాజయం అందుకున్నాడు. ఈయన చేతిలో ప్రస్తుతం 'థగ్‌ లైఫ్‌', 'భారతీయుడు 3' సినిమాలు చేస్తున్నారు. ‘కల్కి 2’ ఉంది కానీ అదెప్పుడో సెట్స్‌పైకి వెళ్తుందో తెలీదు. అయితే బిగ్‌బాస్‌ నుంచి తప్పుకొన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసే కొత్త హోస్ట్‌ ఎవరా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.  

Updated Date - Aug 06 , 2024 | 05:29 PM