Kamal Haasan: సీనియర్లం కాబట్టి ఇలా ఉంటున్నాం అనుకోవద్దు

ABN , Publish Date - Jul 02 , 2024 | 03:20 PM

రజనీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్‌లో మంచి స్నేహితులైన వీరిద్దరూ యువ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు.

Kamal Haasan:  సీనియర్లం కాబట్టి ఇలా ఉంటున్నాం అనుకోవద్దు


రజనీకాంత్ తో(Rajinikanth) తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కమల్‌హాసన్ (Kamla Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్‌లో మంచి స్నేహితులైన వీరిద్దరూ యువ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థ్థానాన్ని సొంతం చేసుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో కమల్‌హాసన్ మాట్లాడుతూ ‘మా ఇద్దరి మధ్య స్నేహం ఎన్నోఏళ్లుగా కొనసాగుతోంది. మేమిద్దరం కలిసి గతంలో సినిమాల్లో కలిసి నటించాం. తర్వాత కలిసి సినిమాలు చేయకూడదని ఒక దశలో నిర్ణయించుకున్నాం. మా ఇద్దరికీ గురువు ఒక్కరే. ఆయనే దర్శకుడు కె.బాలచందర్‌. మా ఇద్దరి మధ్య పోటీతత్వం ఉంది కానీ, అసూయ లేదు. ఇద్దరం రెండు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తామంతే! అయినా, ఎప్పుడూ ఒకరి గురించి మరొకరం చులకన వ్యాఖ్యలు చేసుకోలేదు. ఇప్పుడు సీనియర్లం కాబట్టి ఇలా ఉంటున్నాం అనుకోవద్దు. 20 ఏళ్ల నుంచి మేం ఇలానే ఉంటున్నాం’ అని అన్నారు.  (Rajinikanth Kamal Haasan Friendship)


Kaml.jpg
కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ వయసులో కూడా పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటించిన ‘భారతీయుడు 2’(Indian2) జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితోపాటు మరో 2 సినిమాలు పైప్‌లైన్లో ఉన్నాయి. రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’లో నటిస్తున్నారు. అలాగే లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రం చేయబోతున్నారు. 

Updated Date - Jul 02 , 2024 | 03:20 PM