Kalki Kyra: డీ గ్లామ‌ర్‌గా క‌ల్కి కైరా! ఆగస్టు 23న థియేట‌ర్ల‌లోకి ‘కొట్టుకాళి’

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:18 PM

ప్రముఖ హాస్య నటుడు సూరి , అన్నాబెన్ (కైరా) జంట‌గా నటించిన చిత్రం ‘కొట్టుకాళి’ ఆగస్టు 23వ తేదీన విడుదల చేయ‌నున్న‌ట్లు నిర్మాత, త‌మిళ స్టార్‌ హీరో శివ కార్తికేయ‌న్ తెలిపాడు.

anna ben

ప్రముఖ హాస్య నటుడు సూరి (Soori) హీరోగా బిజీ అవుతున్నారు. ఇటీవలే ఆయన నటించిన గరుడన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ప్రస్తుతం ఆయనకు వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా ఆయన నటించిన కొత్త చిత్రం ‘కొట్టుకాళి’ (Kottukkaali) ఆగస్టు 23వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ (P. S. Vinothraj) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

GF-O5ZPWwAArU_C.jpeg

కల్కి చిత్రంలో కైరాగా దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మేకాక అంద‌రి మ‌న‌సులు దోచుకున్న మలయాళ భామ అన్నాబెన్‌ క‌థానాయిక‌గా కీ రోల్ చేసింది.

GBUERyNaIAAjegB.jpeg

అన్నా ఈ చిత్రంలో డీ గ్లామ‌ర్ లుక్‌లో క‌నిపించ‌నుండ‌గా సినిమా చాలా వ‌ర‌కు త‌నే చుట్టే తిరగనుంది. ఇప్ప‌టికే మ‌ల‌యాళంలో ఆరేడు చిత్రాలు చేసి మంచి పేరు ద‌క్కించుకున్న‌ ఈ భామ ఈ ‘కొట్టుకాళి’ (Kottukkaali) చిత్రంతో త‌మిళ‌నాట ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం.


F--Kgt4asAAQm0_.jpeg

గత సంవత్సరం వెట్రిమారన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘విడుదలై’ చిత్రంతో కథానాయకుడిగా మారిన హాస్య నటుడు సూరి ఆ సినిమా విజయంతో వరుస చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. ‘విడుదలై-2’ భాగం రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇటీవల ఆయన నటించిన ‘గరుడన్‌’ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఇపుడు మరోమారు ‘కొట్టుకాళి’(Kottukkaali) గా ప్రేక్షకుల ముందుకురానున్నారు.

GTFs_alXQAAR3tW.jpeg

హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) సొంతంగా నిర్మించిన‌ ఈ చిత్రం ఇప్పటికే బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో ‘కొట్టుకాళి’ (Kottukkaali) మూవీపై నిర్మాత శివకార్తికేయన్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేస్తూ, ‘ఈ సినిమాను ఆగస్టు 23వ తేదీ విడుదల చేస్తున్నాం. మూఢ నమ్మకాలు, పితృస్వామ్యం, సంక్లిష్టమైన మానవ భావోద్వేగాలు వంటి అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 03:19 PM