Jayam Ravi: జయం రవి విడాకులు.. కోర్టు ఏం చెప్పిందంటే..

ABN , Publish Date - Nov 15 , 2024 | 05:05 PM

తమిళ నటుడు జయం రవి, తన సతీమణి ఆర్తి నుంచి విడిపోతున్నట్లు కొంతకాలం క్రితం ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


తమిళ నటుడు జయం రవి(Jayam Ravi) , తన సతీమణి ఆర్తి (Aarti) నుంచి విడిపోతున్నట్లు కొంతకాలం క్రితం ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెన్నై ఫ్యామిలీ కోర్టు (Chennai Family court) తాజాగా ఈ పిటిషన్‌ను పరిశీలించింది. జయం రవి కోర్టుకు హాజరు కాగా.. ఆర్తి వీడియో కాల్‌లో అందుబాటులోకి వచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థ్థానం.. మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని, రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. విడిపోవాలనుకుంటే.. అందుకు కారణాన్ని స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. 2009లో రవి, ఆర్తి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సెప్టెంబర్‌లో జయంరవి ప్రకటించారు. ‘‘ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం’’ అని తెలిపారు. 

Jasyam.jpg

ఆ పోస్ట్‌ చేసిన ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు.  తనకు తెలియకుండానే, అనుమతి తీసుకోకుండానే విడాకల గురించి ఆయన బహిరంగంగా ప్రకటించారని చెప్పింది. దీంతో వీరి విడాకుల వ్యవహారం చర్చకు దారి తీసింది. భార్య ఆరోపణలపై ఆయన గతంలో కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘లాయర్‌ ద్వారా ఆర్తికి విడాకుల నోటీసు పంపించాను. ఈ విషయం ఆమె తండ్రికీ తెలుసు. ఈ విషయం గురించి మా ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్నారు. నేను అందుబాటులో లేనని, వారికి తెలియకుండానే విడాకులు ప్రకటించానని వాళ్లు ఎలా చెప్పగలుగుతున్నారు?’’ అని ప్రశ్నించారు. ఓ సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నానంటూ జరిగిన ప్రచారంపైనా ఆయన స్పందించారు. అవన్నీ అవాస్తవమన్నారు. భార్య వల్ల జయం రవి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. వైవాహిక బంధంలో ఆయన ఎంతో బాధ అనుభవించారని ఆ సింగర్‌ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

Updated Date - Nov 15 , 2024 | 05:05 PM