Indian 2: మరింత హైప్ కోసం.. 

ABN , Publish Date - Jun 23 , 2024 | 02:45 PM

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘ఇండియన్‌ 2’ (Indian 2). తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించారు.

Indian 2: మరింత హైప్ కోసం.. 

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘ఇండియన్‌ 2’ (Indian 2). తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ మరియు రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఉదయనిధి స్ట్టాలిన, సుభాస్కరన్ (Subhaskaran) బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన 'ఇండియన్' సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందుతుంది. ఇందులో సిద్దార్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌ శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జులై 12న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానాకి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభించింది. అయితే భారీ స్థాయి, పెద్ద క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్నా సినిమాకు అంతా హైప్‌ రావడం లేదు. అందుకే మేకర్స్‌ భారీ స్థాయిలో హైప్‌ తీసుకురావడానికి ప్రమోషన్స్  బాగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ట్రెలర్‌ను వదలనున్నారు. తాజాగా ట్రైలర్‌ అప్డేట్‌ ఇచ్చారు. ఈ నెల 25న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసి తెలిపారు. ఈ పోస్టర్‌లో సేనాపతి అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తున్నట్లుగా వుంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఎస్‌.జె.సూర్య, బాబీ సింహ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.  

Updated Date - Jun 23 , 2024 | 02:52 PM