Upendra: ‘రైట్‌ టూ రీకాల్‌’ అమలు చేయాలి

ABN , Publish Date - Jun 16 , 2024 | 10:49 AM

‘‘రాజకీయాలు కలుషితం కాకూడదు.. దానిలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉండకూడదు.  అవినీతి ఉండకూడదు.  సమస్యలే ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరగాలి.  ‘రైట్‌ టూ రీకాల్‌’ అమలు చేయాలి’’ ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి.

Upendra: ‘రైట్‌ టూ రీకాల్‌’ అమలు చేయాలి

‘‘రాజకీయాలు కలుషితం కాకూడదు..

దానిలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉండకూడదు. 

అవినీతి ఉండకూడదు.  సమస్యలే ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరగాలి. 

‘రైట్‌ టూ రీకాల్‌’ అమలు చేయాలి’’ ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి.

పవన్‌ కళ్యాణ్‌గారు (Pawankalyan) రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత- నన్ను రాజకీయాల్లోకి రమ్మని మా దగ్గర అనేకమంది అడిగారు. ఆయనకు నాకు తేడా ఉంది. ఆయనకు ఒకటే లక్ష్యం, ఆదర్శం. కానీ నా పరిస్థితి వేరు" అని అన్నారు కన్నడ  నటుడు ఉపేంద్ర. నటనలో అయన శైలి వేరు.. ఆలోచనల్లో అయన తీరు వేరు. నవ్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

Upendra-2.jpg

"నేను భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా నా వృత్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు- సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకొనేవాణ్ణి. అదొక కోణం. కానీ నేను ఎప్పుడూ రియాలిటీలోనే బతుకుతూ ఉంటా. అయితే ఏదో చేయాలనే తపన మాత్రం నన్ను వెంటాడుతూ ఉంటుంది.  నా వరకూ ఒక ట్రెండ్‌ను మొదలుపెట్టాలనుకుంటా. నేను నిజాయితీగా నాకు నచ్చినట్లు సినిమా తీస్తా. ఒక సినిమా హిట్‌ అయింది కాబట్టి ఆ తరహాలో తీయాలని ప్రయత్నించను. నా ఉద్దేశంలో సినిమాల విజయానికి ఒక ఫార్ములా లేదు. నిజాయితీగా... మనకు నచ్చిన సినిమా తీయటమే అసలైన ఫార్ములా!

ఐదేళ్లకు ఒకసారి...

నటన, దర్శకత్వం రెండు నాకు ఇష్టమే. అంత కన్నా సినిమా నిర్మాణమంటేనే ఇష్టం. డైరక్షన్‌ అంటే... ఒక సినిమాను మన ఆలోచనల నుంచి పుట్టించటం. దాని థ్రిల్లే వేరు. కానీ నటన మరో సముద్రం. డైరక్టర్‌ చెప్పినట్లు చేయాలి. నా ఉద్దేశంలో నటన కన్నా డైరక్షన్‌ ఎక్కువ థ్రిల్‌ ఇస్తుంది. అందుకే నేను రెండింటిలోనూ కొనసాగుతున్నా! ఐదేళ్లకు ఒకసారి డైరక్షన్‌ చేస్తూ ఉంటా!

Ant.jpg

ఏఎన్నార్  చెప్పిన అద్భుతమైన మాట 

నా ఉద్దేశంలో డైరక్టర్‌ చెప్పినట్లు నటుడు చేయాలి. నేను ‘హెచ్‌టూఓ’ అనే సినిమా చేసే సమయంలో ఏఎన్నాఆర్‌గారిని - ‘ప్రకృతి’ అనే ఒక పాత్ర చేయమని అడగటానికి వెళ్లా.. కథ చెప్పా. ఆయనకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్‌ ఎలా ఉండాలో నాకు చెబుతూ ఆయన ఊహాల్లోకి వెళ్లిపోయారు. తెల్ల గెడ్డం, తెల్లటి దుస్తులు, వెనుక కాంతి,అందమైన ప్రకృతి... ఇలా ఆ పాత్ర ఎలా ఉండాలో చాలాసేపు చెప్పారు. అయితే ఆయనకు అవుట్‌డోర్‌ షూటింగ్‌ చేసే ఓపిక లేదు. అందువల్ల ఆ పాత్ర చేయలేనన్నారు. ఆ సందర్భంలో- ఆయన కొన్ని గొప్ప మాటలు చెప్పారు. ‘‘ నటుడిగా నాకు ఒక ప్రిన్సిపల్‌ ఉంది. నేను ఫిల్మ్‌ ఒప్పుకొనేముందు కింగ్‌లా ప్రవర్తిస్తా. నాకు కావాల్సివన్నీ అడుగుతా. ఎక్కడా రాజీ పడను. పూర్తిగా తృప్తి చెందితేనే సినిమా ఒప్పుకుంటా. అయితే ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత నేను బానిసలా పనిచేస్తా...’’ అని అన్నారు. పరిశ్రమలో వారందరూ నేర్చుకోవాల్సిన విషయమది. ఆ మాటల్లోనే- ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. ‘‘గతంలో నా దగ్గరకు ఏదైనా మంచి స్క్రిప్ట్  వస్తే- అది నాకన్నా ఎన్టీఆర్‌కు బావుంటుందని అనిపిస్తే- దాన్ని ఆయన దగ్గరకు పంపేవాణ్ణి.. నేనే ఫోన్‌ చేసి స్వయంగా చెప్పేవాణ్ణి. ఆయన కూడా అలా చేసేవారు’’ అని అన్నారు. అందరూ వాళ్లిద్దరి మాదిరిగా ఉంటే చాలా బావుంటుందనిపిస్తుంది.

Upendra-3.jpg

మనం టూల్స్ మాత్రమే.. 

‘వయస్సు అయిపోయింది కాబట్టి ఫిలాసఫీ చెబుతున్నాడు’ అని మీరు అనుకోవచ్చు కానీ సినిమాలన్నీ కాలమాన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయనిపిస్తుంది. ఒక్కసారి నా సినిమాలనే తిరిగి చూసుకుంటే- ‘ఏ’, ‘ఉపేంద్ర’, ‘సూపర్‌’ లాంటి సినిమాలు ఎలా చేశాను? అనిపిస్తుంది. స్టుపిడిటీ అనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితుల్లో చేశానంతే! ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లు అందరి దగ్గరా ఉన్నాయి. మొబైల్‌ను నేనే ఆవిష్కరించానని ఒక శాస్త్రవేత్త చెప్పుకున్నాడనుకుందాం. నా ఉద్దేశంలో అది సత్యం కాదు. జనాభా పెరిగిపోయింది. ప్రజల మధ్య కమ్యూనికేషన్‌కు ఒక సమర్థమైన సాధనం కావాలి. దీని కోసం ప్రకృతే మొబైల్‌ ఫోన్‌ అనే సాధనాన్ని కనుగొనేలా చేసింది. మనం కేవలం టూల్స్‌ మాత్రమే!

Updated Date - Jun 16 , 2024 | 10:49 AM