GV Prakash: ధనుష్ వదిలిన జివి ప్రకాష్ లుక్ 

ABN , Publish Date - Dec 13 , 2024 | 07:48 PM

నటుడు, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మెంటల్ మనదిల్‌'.


నటుడు, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్(GV Prakash), క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్ సెల్వరాఘవన్ (Selva Raghavan)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మెంటల్ మనదిల్‌'(Mental MAnaDhil) ఈ సినిమా ఫస్ట్ లుక్ ను  ధనుష్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో మాధురీ జైన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అరుణ్ రామకృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.  జివి ప్రకాష్ కుమార్ కంటెంట్-డ్రివెన్ హీరోగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. '7G రెయిన్‌బో కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరు' లాంటి క్లాసిక్స్ అందించిన సెల్వరాఘవన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. సెల్వరాఘవన్, 'ఇసై అరసన్' జివి ప్రకాష్ కుమార్‌ లది క్రేజీ కొలబారేషన్. 'మెంటల్ మనదిల్' ఫస్ట్ లుక్‌ అభిమానులు, సినీ వర్గాల్లో అంచనాలను పెంచింది.

Updated Date - Dec 13 , 2024 | 07:48 PM