Benz: లోకేష్‌, లారెన్స్‌ ‘బెంజ్‌’లో.. ఎస్‌జే సూర్య, ఫహద్‌ ఫాజిల్‌? కాంబినేస‌న్ అదిరిందిగా

ABN , Publish Date - Jul 04 , 2024 | 01:25 PM

లోకేష్‌ కనకరాజ్ సొంత నిర్మాణ సంస్థ ‘జి స్క్వేర్‌’ బ్యానరుపై రాఘవ లారెన్స్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘బెంజ్‌’. ఇందులో ఎస్‌జే సూర్య, ఫహద్‌ ఫాజిల్ న‌టిస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి.

benz

యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్(Lokesh Kanagaraj) సొంత నిర్మాణ సంస్థ ‘జి స్క్వేర్‌’ బ్యానరుపై రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘బెంజ్‌’(Benz). ఇందులో సీనియర్‌ నటులు ఎస్‌జే సూర్య (SJ Suryah), ఫహద్‌ ఫాజిల్ (Fahadh Faasil) ఆన్‌బోర్డులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

‘రెమో’, ‘సుల్తాన్‌’ వంటి హిట్‌ చిత్రాలను రూపొందించిన భాగ్యరాజ్‌ కన్నన్ (Bakkiyaraj Kannan) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథ డిమాండ్‌ మేరకు ఈ ఇద్దరు అగ్రనటులను తీసుకున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

lokes.jpg


కాగా, ‘మా నగరం’, ‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాలను రూపొందించిన యంగ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్ (Lokesh Kanagaraj).. జి స్క్వేర్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంగా గ‌త సంవ‌త్స‌రం ‘ఫైట్‌ క్లబ్‌’ను తెరకెక్కించారు.

అలా నిర్మాతగా మారిన లోకేష్‌.. ఇప్పుడు తన బ్యానర్‌పై రెండో చిత్రంగా ‘బెంజ్‌’ (Benz)చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Superstar Rajinikanth) హీరోగా త‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ‘కూలీ’ (Coolie) చిత్రం వ‌చ్చే ఏడాది వేస‌విలో థియేట‌ర్ల‌లోకి రానుంది.

Updated Date - Jul 04 , 2024 | 01:25 PM