తెలుగులో ఎంట్రీ.. త‌మిళ‌నాట దూసుకుపోతున్న సోద‌రులు

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:25 PM

తెలుగు సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చి వ‌రుస సినిమాల‌తో త‌మిళ నాట దూసుకుపోతున్నారు అన్న‌ద‌మ్ములు శివ‌, బాల‌. ప్ర‌స్తుతం కొలీవుడ్‌లో ఆగ్ర ద‌ర్శ‌కుడిగా, బిజీ ఆర్టిస్టుగా గుర్తింపును ద‌క్కించుకున్నారు.

siva bala

తెలుగు సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు త‌మిళ‌నాట ఆగ్ర ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతున్నాడు చిరుత్తై శివ (Siruthai Siva). తెలుగులో గోపీచంద్‌తో శౌర్యం (Souryam),శంఖం (Sankham), ర‌వితేజ‌తో ద‌రువు (Daruvu) వంటి హిట్ చిత్రాల‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్న డైరెక్టర్ శివ.

siva

ఆ త‌ర్వాత త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డ సూప‌ర్‌స్టార్ అజిత్‌తో వేదాళం (Vedalam), విశ్వాసం (Viswasam), వీర‌మ్ (Veeram), వివేకం (Vivegam) వంటి నాలుగు బ్లాక్‌బ‌స్టర్ చిత్రాల‌ను రూపొందించాడు. చివ‌ర‌గా ర‌జ‌నీకాంత్‌తో అన్నాతై(Annaatthe) (తెలుగులో పెద్ద‌న్న‌) చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌స్తుతం సూర్య‌తో కంగువా (Kanguva) అనే పిరియాడిక్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

siva

ఇదిలాఉండ‌గా శివ (Siva) ఇలా భారీ చిత్రాల‌తో ఓ వైపు బిజీగా ఉండ‌గా అయ‌న సోద‌రుడు బాలా కుమార్ (Bala) న‌టుడిగా వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు. 20 యేండ్ల క్రితం టూ మ‌చ్ అనే తెలుగు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలా అ త‌ర్వాత ఛాప్ట‌ర్ 6 అనే చిత్రంలో న‌టించారు.

4.jpg

ఆపై తమిళంతో పాటు మలయాళంలోనూ వరుస అవ‌కాశాల‌తో చాలా బిజీగా మారారు. తమిళంలో అన్బు, కాదర్‌ కిసుకిసు, కళింగా, వీరం, తంబి, అన్నాత్త వంటి అనేక చిత్రాల్లో నటించిన బాల మలయాళంలో సూపర్‌స్టార్‌ మమ్మూట్టి వంటి అగ్రహీరోల చిత్రాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు.


bala-siruthaisiva-3132023mt-7ca.jpg

తమిళంలో కేవలం క్యారెక్టర్‌ పాత్రలకే పరిమితమైన బాల (Bala) మలయాళంలో మాత్రం ఇప్ప‌టికే 50కి పైగా చిత్రాల‌లో హీరో, విలన్‌ పాత్రల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే 2021 త‌ర్వాత‌ అనారోగ్యం కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయ‌న ఇప్పుడిప్పుడే మళ్ళీ వరుస చాన్సులు దక్కించుకుంటూ బిజీ అవుతున్నారు.

x10801-1611039484-1678186657.jpg

ప్ర‌స్తుతం నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. దీంతో త‌న‌ అన్న ద‌ర్శ‌కుడు శివ స‌పోర్ట్ లేకుండానే ఛాన్సులు ద‌క్కించుకుంటూ అన్న‌ను మించిన త‌మ్ముడిగా పేరు తెచ్చుకుంటున్నాడు.

144.jpg

ఇదిలాఉండ‌గా అన్న శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన త‌మిళ సినిమాలు వేదాళం చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి భోళా శంక‌ర్‌గా, వీర‌మ్ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కాట‌మ‌రాయుడిగా తెలుగులో రిమేక్ చేయ‌డం విశేషం. అదేవిధంగా విశ్వాసం, వివేకం చిత్రాలు తెలుగులోనూ డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేయ‌గా ఇక్క‌డా మంచి విజ‌య‌వంతం అయ్యాయి.

Updated Date - Jul 25 , 2024 | 01:25 PM