Shankar: దర్శకుడు శంకర్ కూతురు ద్వితీయ వివాహం.. తరలొచ్చిన తారాలోకం
ABN , Publish Date - Apr 15 , 2024 | 09:23 PM
దర్శకుడు శంకర్ కూతురు వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తమిళ.. తారాలోకం తరలొచ్చింది.
చెన్నై తారల సందడితో చెన్నై మెరిసిపోయింది. ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న తరుణ్ కార్తికేయన్ (Tarun Karthikeyan )కు తన పెద్ద కూతురు ఐశ్వర్య (Aishwarya Shankar)ల నిశ్చితార్ధం రెండు నెలల క్రితం జరుగగా తాజాగా పెళ్లితో ఒకటయ్యారు. ఇదిలాఉండగా డాక్టర్ అయిన ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి కావడం విశేషం.
అతికొద్ది మంది సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళ ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ నటులంతా హజరై వధూవరులను అశీర్వదించారు. రజనీకాంత్ (Rajinikanth), కమల్‌హసన్ (Kamal Haasan), విక్రమ్ (Vikram), సూర్య (Suriya), కార్తి, నయనతార(Nayanthara), మణిరత్నం (Maniratnam), సుహాసిని (Suhasini), భారతిరాజా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin) వంటి ప్రముఖులు హజరయ్యారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తెలుగు నుంచి సినీ ప్రముఖులు ఎవరైనా హజరయ్యారా లేదా అనేది తెలియాల్సి ఉంది.