HMM: సినిమాలోని సన్నివేశాలన్నీ రాత్రిపూటే చిత్రీకరించాం.
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:59 PM
గే కథతో రూపొందిన చిత్రం ‘హెచ్.ఎం.ఎం’. నరసింహన్ ఫక్రీసామి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాణం, దర్శకత్వం చేశారు.
దట్టమైన అడవిలో ఉన్న ఓ ఇంటిలో జరిగే మూడు హత్యల వెనుక ఉన్న మర్మమేంటి అనే ఇతివృత్తంతో ఒక రాత్రిలో జరిగే కథతో రూపొందిన చిత్రం ‘హెచ్.ఎం.ఎం’ (HMM - Hug Me More). బ్రైట్ ఎంటర్‌టైన్మెంట్ (Bright Entertainment) పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో నరసింహన్, సుమీరా, శివ, షర్మిల, అనురాగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పురూష్ నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాణం, దర్శకత్వం నరసింహన్ ఫక్రీసామి (Narasiman Packirisamy).
ఈ సినిమా వివరాలను దర్శకుడు వివరిస్తూ, ‘ఈ మూవీలో ఒక్క పాట కూడా లేదు. సినిమాలోని సన్నివేశాలన్నీ రాత్రిపూటే చిత్రీకరించాం. అడవిలో ఉన్న ఇంటిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు ఎందుకు జరిగాయి? ఎవరు చేశారు? ఈ హత్యల వెనుక ఉన్న మర్మమేంటి? అనే అంశాలు ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకుడు ఉత్కంఠకు గురిచేసేలా చిత్రీకరించాం. నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలం చేకూర్చనుంది. అన్ని నిర్మాణ పనులను పూర్తి చేసి ఈ నెల 31వ తేదీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.