Mari Selvaraj: దక్షిణాది జిల్లాల్లో.. ప్రతి ఒక్కరి మనసుల్లో కుల ముద్ర ఉంది: మారి సెల్వరాజ్‌

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:25 PM

దక్షిణాది జిల్లాల్లో.. ప్రతి ఒక్కరి మనసుల్లో కుల ముద్ర ఉందని, రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని ప్రముఖ త‌మిళ సినీ దర్శకుడు మారి సెల్వరాజ్ అన్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌పై తన అభిప్రాయాలు తెలిపాడు.

Mari Selvaraj: దక్షిణాది జిల్లాల్లో.. ప్రతి ఒక్కరి మనసుల్లో కుల ముద్ర ఉంది: మారి సెల్వరాజ్‌
mari selvaraj

దక్షిణాది జిల్లాల్లో.. ప్రతి ఒక్కరి మనసుల్లో కుల ముద్ర ఉందని, రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని ప్రముఖ త‌మిళ సినీ దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) అభిప్రాయ పడ్డారు. క‌ర్ణ‌న్‌, మామ‌న్న‌న్ సినిమాల‌తో త‌మిళంలో టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఆయ‌న నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌మిళ‌నాట వార్త‌ల్లో నిలుస్తుంటాడు. తాజాగా విక్ర‌మ్ కుమారుడు ధృవ్‌తో బైస‌న్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

mari selvaraj.jpg

ఈ క్ర‌మంలో సినిమా షూటింగ్‌ నిమిత్తం చెన్నై నుంచి తూత్తుక్కుడికి వ‌చ్చిన ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ... ‘దక్షిణాది జిల్లాల్లో మానసికంగా ప్రతి ఒక్కరి మనసుల్లో కుల ముద్ర ఉంది. ఇది వారి మనసుల్లో లోతుగా నిక్షిప్తమై ఉంది. దీన్ని ఒక్క రోజులో తొలగించలేం. కానీ కాలక్రమేణా అన్నీ మారుతాయి. ప్రతి ఒక్కరూ కలిసి దీన్ని తొలగించేందుకు గట్టిగా కృషి చేయాలన్నారు.


selvaraj.webp

కొంత‌కాలం క్రితం వ‌ర‌కు సినిమాలు థియేట‌ర్ల‌లో మాత్ర‌మే చేసే వారం ఇప్పుడా ప‌రిస్థితి లేదు. సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది ఉంటుంది.. కానీ, ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఎలాంటి భేష‌జాలు లేకుండా కలిసి సినిమా చూసే చోటు సినిమా థియేటర్‌. అది ఎప్పటికీ మారదు. నటుడు విజయ్‌ రాజకీయ ప్రవేశం ఆయన సొంతం ఇష్టం. రాజకీయాల్లోకి ప్రతి ఒక్కరూ రావొచ్చు’ అని పేర్కొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 06:25 PM