Divorce: మరో హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?

ABN , Publish Date - Jun 25 , 2024 | 10:40 PM

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పదం ‘విడాకులు’. సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత.. సెలబ్రిటీల విడాకులు అనగానే అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. ధనుష్, నిహారిక.. ఇలా ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగానే పెరుగుతోంది. ఇప్పుడీ లిస్ట్‌లోకి మరో తమిళ హీరో చేరబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Divorce: మరో హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?
Aarti and Jayam Ravi

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పదం ‘విడాకులు’ (Divorce). సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత.. సెలబ్రిటీల విడాకులు అనగానే అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. ధనుష్, నిహారిక.. ఇలా ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగానే పెరుగుతోంది. ఇప్పుడీ లిస్ట్‌లోకి మరో తమిళ హీరో చేరబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. జయం రవి (Jayam Ravi).

తమిళ ఇండస్ట్రీకే కాకుండా.. టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా జయం రవి పరిచయమే. ఎలా అంటే, జయం రవి వాళ్ల నాన్న ప్రముఖ ఎడిటర్ మోహన్ (Editor Mohan). అలాగే జయం రవి వాళ్ల అన్న రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్‌ఫాదర్’ (Godfather) సినిమా తీసిన మోహన్ రాజా (Mohan Raja). ఈ ఫ్యామిలీ అంతా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరి ఈ ఫ్యామిలీలో ఏమైందో ఏమో గానీ.. కొన్నాళ్లుగా జయం రవి, అతని భార్య విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read- Bharateeyudu2 Trailer: సేనాప‌తి స్వైర విహారం.. బాక్సాఫీస్ బద్దలే..


Jayam-ravi-couple.jpg

జయం రవి 2009లో ఆర్తీ (Aarti) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఎంతో సంప్రదాయబద్దంగా పెద్దలందరి సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దాదాపు 15 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటపై.. సడెన్‌గా విడిపోతున్నారనే వార్తలు ప్రచారమవుతుండటంతో.. అసలు ఏమై ఉంటుందా? అని అంతా అనుకుంటున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

కోలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని, ఒకరంటే ఒకరికి పడటం లేదనేలా టాక్ వినబడుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా.. ఆర్తీ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తన భర్త ఫొటోలన్నింటినీ తీసేసింది. అంతే.. ఇక జయం రవి, ఆర్తీ విడిపోతున్నారు.. అందుకే ఆర్తీ ఆ ఫొటోలని తీసేసిందంటూ కోలీవుడ్ మీడియా టామ్ టామ్ చేస్తోంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ కూడా ఈ వార్తలపై స్పందించకపోవడం గమనార్హం.

Read Latest Cinema News

Updated Date - Jun 25 , 2024 | 10:40 PM