Captain Miller: ధనుష్ కెప్టెన్ మిల్లర్ అరుదైన ఘనత.. ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డు
ABN , Publish Date - Jul 07 , 2024 | 07:14 AM
హీరో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రానికి లండన్ నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అరుదైన గుర్తింపు లభించింది. ఉత్తమ విదేశీ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది.
హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ (CaptainMiller) చిత్రానికి లండన్ నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ( National Film Awards UK)లో అరుదైనగుర్తింపు లభించింది. ఈ చిత్రోత్సవంలో సినిమాను ప్రదర్శించగా ఉత్తమ విదేశీ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది.
అరుణ్ మాధేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar), ప్రియాంక మోహన్ (Priyanka Mohan), సందీప్ కిషన్ (Sundeep Kishan) తదితరులు నటించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ ‘కెప్టెన్ మిల్లర్’ (CaptainMiller) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ (Satya Jothi Films) పతాకంపై టీజీ త్యాగరాజన్ చారిత్రక నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నేపథ్యంలో లండన్‌లోని బోర్సెస్టర్ హాల్‌లో జరిగిన పదో లండన్ నేషనల్ ఫిల్మ్ అకాడెమీ ఫెస్టివల్‌లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికై అవార్డు సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. కాగా, ప్రస్తుతం ధనుష్ (Dhanush) నటించిన ‘రాయన్’, ‘కుబేరా’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, వీటిలో ‘రాయన్’ మూవీ ఈ నెలాఖరులో విడుదలకానుంది.