Dhanush: వయనాడ్‌ ఘటన.. ధనుష్‌ విరాళం ఎంత అంటే!

ABN , Publish Date - Aug 11 , 2024 | 08:04 PM

‘రాయన్‌’ చిత్రం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు ధనుష్‌. తాజాగా మరోసారి ఆయన తన మంచి మనసును చాటుకున్నారు. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో.. తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.



‘రాయన్‌’ చిత్రం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు ధనుష్‌. తాజాగా మరోసారి ఆయన తన మంచి మనసును చాటుకున్నారు. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో.. తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఆ మొత్తాన్ని అందజేయనున్నారు. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయి ఘటన గుండెల్ని కదిలించింది. సినీతారలు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ఇటీవల చిరు కేరళ  రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చెక్‌ కూడా అందించారు. ప్రభాస్‌ రూ.2 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అల్లు   అర్జున్‌ రూ.25 లక్షల కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. 

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి  హీరో సూర్య, జ్యోతిక, కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు రూ.20 లక్షలు, మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, కమల్‌ హాసన్‌ రూ. 25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆయన వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా రూ.3 కోట్ల విరాళం బాధితులకు అందిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - Aug 11 , 2024 | 08:04 PM