Darshan: హీరో దర్శన్‌, పవిత్రగౌడ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ABN , Publish Date - Oct 15 , 2024 | 01:12 PM

క‌న్న‌డ ఆగ్ర న‌టుడు దర్శన్, న‌టి ప‌విత్ర గౌడల‌కు కోర్టులో చుక్కెదురైంది. వారి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

darshan

క‌న్న‌డ ఆగ్ర న‌టుడు దర్శన్ (Actor Darshan), న‌టి ప‌విత్ర గౌడ (Pavithra Gowda)ల‌కు కోర్టులో చుక్కెదురైంది. వారి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renukaswamy) హత్యకేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ (Actor Darshan), ఏ1 నిందితు రాలు పవిత్రగౌడల బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ సోమవారం 57వ సీసీహెచ్‌ కోర్టు తీర్పు ప్రకటించింది. త‌న అభిమాని హత్య కేసులో పోలీసులు జూన్‌ 11న దర్శన్‌ను అరెస్టు చేశారు. ఇటీవలే చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో దర్శన్‌ తరపు న్యాయవాదులు సెప్టెంబరు 21న బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం వారం క్రితమే ప్రక్రియను ముగించి తీర్పును పెండింగ్‌లో ఉంచారు.

GQ_gMn8b0AAE77k.jpeg

అక్టోబరు 14న సోమవారం తీర్పు ప్రకటిస్తామని న్యాయమూర్తి జయశంకర్‌(Justice Jayashankar) వెల్లడించారు. దీంతో పరప్పన అగ్రహార జైలులో ఉన్న పవిత్రగౌడ (Pavithra Gowda), బళ్ళారి జైలులో ఉన్న దర్శన్‌ బెయిల్‌ తీర్పుకోసం ఎదురు చూశారు. న్యాయమూర్తి జయశంకర్‌ సోమవారం సా యంత్రం బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసినట్టు ప్రకటించారు. దీంతో దర్శన్‌ మరింతకాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రసన్నకుమార్‌ వాదనలు వినిపించగా దర్శన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది సీవీ నగేశ్‌ వాదించారు.

GZ5ycmzb0AEAu_w.jpeg

కాగా బెయిల్‌ తీర్పు ఎలా ఉంటుందోనని ఆదివారం రాత్రి జైలులో దర్శన్ (Actor Darshan) తీవ్రమైన ఒత్తిడితో గడిపినట్లు సమాచారం. బెయిల్‌ వస్తుందో, రాదోనని ఆవేదనతో గడిపినట్లు తెలుస్తోంది. తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, బెంగళూరులో చికిత్స జరిపించుకోవాలని దర్శన్ (Actor Darshan) ప్రయత్నిస్తున్నట్ల్టు తెలుస్తోంది. ఏ11 నాగరాజు, ఏ12 లక్ష్మణ్‌ బెయిల్‌ పిటిషన్‌లనూ కొట్టివేశారు. ఏ13 దీపక్‌, ఏ8 రవిశంకర్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - Oct 15 , 2024 | 01:12 PM