ధ‌నుష్ Vs శివ కార్తికేయ‌న్! త‌మిళ‌నాట రచ్చ రంబోళా

ABN , Publish Date - Aug 14 , 2024 | 02:21 PM

ఇటీవ‌ల త‌మిళ మీడియాల్లో బాగా హాట్‌టాపిక్‌గా మారుతున్నారు స్టార్ హీరోలు ధ‌నుష్, శివ కార్తికేయ‌న్ లు. తాజాగా శివ కార్తికేయ‌న్ ప‌రోక్షంగా ధ‌నుష్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు అక్క‌డ పెద్ద‌ దుమారాన్నే రేపుతున్నాయి.

dhanush

ఇటీవ‌ల త‌మిళ మీడియాల్లో బాగా హాట్‌టాపిక్‌గా మారుతున్నారు స్టార్ హీరోలు ధ‌నుష్ (Dhanush), శివ కార్తికేయ‌న్ (Sivakarthikeyan)లు. ఈమ‌ధ్యే త‌మిళ నిర్మాత‌లు ధ‌నుష్‌పై బ్యాన్ విధించిన వార్త సంచ‌ల‌నం సృష్టించ‌గా తాజాగా శివ కార్తికేయ‌న్ ప‌రోక్షంగా ధ‌నుష్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు అక్క‌డ పెద్ద‌ దుమారాన్నే రేపుతున్నాయి. అస‌లు విష‌యానినికి వ‌స్తే..

వ‌రుస విజ‌య‌వంతమైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్టార్‌డ‌మ్‌ను తెచ్చుకున్న న‌టుడు శివ కార్తికేయ‌న్ (Sivakarthikeyan) అయ‌లాన్ సినిమాతో కోలీవుడ్ లో 100 కోట్ల వసూళ్లు అందుకుని త‌ర కెరీర్‌లో తిరుగులేని రికార్డును సాధించాడు. అయితే హీరోగానే కాకుండా వ‌రుస‌గా కొత్త వారితో సినిమాలు నిర్మిస్తూ అవార్డులు , రివార్డులు సంపాదిస్తున్నారు. ధ‌నుష్ (Dhanush) స్వ‌త‌హాగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వ‌చ్చి హాలీవుడ్‌, బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించేంత గుర్తింపు తెచ్చుకున్నాడు.

GU2rXSobQAA9esp.jpeg


రీసెంట్‌గా శివ కార్తికేయ‌న్ (Sivakarthikeyan) ఇటీవ‌లే హీరోగా మారిన క‌మెడియ‌న్ సూరి ప్ర‌ధాన పాత్ర‌లో కొట్టుక్కాలి అనే సినిమాను నిర్మించాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం జాతీయ‌, అంత‌ర్జాతీయ వేదిక‌ల్లో చాలా అవార్డులు సొంతం చుసుకుంది. ఆగ‌స్టు15న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా నిర్వ‌హించిన ప్రచార కార్యక్రమంలో శివ కార్తికేయ‌న్‌ మాట్లాడుతూ, ఈ సినిమాతో తను ఎవ‌రికీ జీవితం ఇవ్వ‌ట్లేద‌ని ఇలా సినిమా తీయడం ద్వారా జీవితాల్ని నిల‌బెట్టేశామ‌ని అనుకోకూడ‌ద‌ని, గ‌తంలో కొంద‌రు ఇలాగే త‌న గురించి మాట్లాడి త‌న‌ను ఇబ్బంది పెట్టార‌ని శివ కార్తికేయ‌న్ అన్నాడు.

dhanushspeech.jpg

అయితే.. శివ‌కార్తికేయ‌న్ తన ప్ర‌సంగంలో ఎవ‌రి పేరూ ప్రస్తావించకున్నా, అతను ధ‌నుష్ (Dhanush)ను ఉద్దేశించే ఇలా మాట్లాడాని తెగ‌ ప్ర‌చారం జరుగుతోంది. ఫ్యాన్ వార్ కూడా భారీగా మొద‌లైంది. గతంలో శివ కార్తికేయన్ శివ కార్తికేయ‌న్ (Sivakarthikeyan) ఓ టీవీలో యాంకర్‌గా, వీజేగా ప‌ని చేస్తూనే సినిమాల్లో స‌హాయ పాత్ర‌లు చేస్తూ.. ‌హీరోగా ఎదిగాడు. అతని కెరీర్ తొలి నాళ్ల‌లో ధ‌నుష్ (Dhanush) శివకార్తికేయన్‌కు ప‌లు అవకాశాలు ఇవ్వ‌డ‌మేకాక శివ కార్తికేయన్ హీరోగా ఎదిర్ నీచ్చిల్ అనే సినిమాను నిర్మించాడు. కానీ త‌ర్వాత వీరి మ‌ధ్య అభిప్రాయ భేదాలు వ‌చ్చి దూరం అయ్యార‌నే ప్ర‌చారం ఉంది.

కాగా.. 2024 సంక్రాంతికి ధ‌నుష్ (Dhanush) కెప్టెన్ మిల్ల‌ర్, శివ కార్తికేయన్ శివ కార్తికేయ‌న్ (Sivakarthikeyan) అయ‌లాన్ సినిమాలతో పోటీ పడ్డారు.. అప్పుడు వారి అభిమానుల మధ్య వాదోపవాదాలు ఓ రేంజ్‌లో జరిగాయి. తాజాగా ఇప్పుడు శివ కార్యకేయన్ వాఖ్యలతో మరోసారి ధనుష్ , శివకార్తికేయన్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్దం మొదలైంది.

Updated Date - Aug 14 , 2024 | 02:21 PM