Chinmayi Sripaada: న్యాయం ఎప్పుడు జరుగుతుందో? వేచి చూస్తూనే ఉంటా!
ABN , Publish Date - Jan 02 , 2024 | 04:40 PM
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి (Chinmayi Sripaada) మరోసారి రెచ్చిపోయింది. తనని లైంగికంగా వేధించి, కెరీర్ సర్వనాశనం అయ్యేలా చేసిన తమిళ రచయిత వైరముత్తుపై(vairamuthu) మరోసారి విమర్శల వర్షం కురిపించింది.
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి (Chinmayi Sripaada) మరోసారి రెచ్చిపోయింది. తనని లైంగికంగా వేధించి, కెరీర్ సర్వనాశనం అయ్యేలా చేసిన తమిళ రచయిత వైరముత్తుపై(vairamuthu) మరోసారి విమర్శల వర్షం కురిపించింది. అంతే కాదు అతడితోపాటు ఉన్న కమల్ హాసన్, పి.చిదంబరం, సీఎం స్టాలిన్ తీరుపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందంటే తమిళ రచయిత వైరముత్తు రాసిన ‘మహా కవితై’ పుస్తకావిష్కరణ తాజాగా చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం, విశ్వనాయకుడు కమల్‌హాసన్ హాజరయ్యారు. తనని లైంగికంగా వేధించి, కెరీర్ నాశనమయ్యేలా చేసిన వైరముత్తుకి.. తమిళనాడులోని మోస్ట్ పవర్‌ఫుల్ మెన్ సపోర్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో? అని బాధతో చిన్మయి ట్వీట్ చేసింది.
2018లో రైటర్ వైరముత్తుపై సింగర్ చిన్మయి ఆరోపణలు చేసింది. కెరీర్ బిగినింగ్‌లో తనను లైంగికంగా వేధించాడని బయటపెట్టింది. మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో చిన్మయి ఈ ఆరోపణలు చేసింది. ఈమెతో పలువురు గాయనీమణులు కూడా వైరముత్తు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అయితే వైరముత్తుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తమిళ ఇండస్ట్రీలో చిన్మయిపై నిషేదం విధించారు. దీంతో అప్పటి నుంచి వైరముత్తపై చిన్మయి ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ ఉంది. ఇప్పుడు కూడా అలానే వైరముత్తుకి సపోర్ట్ చేస్తున్న స్టాలిన్, కమల్ తదితరులపైౖ కూడా విమర్శలు చేసింది. కొద్ది రోజుల క్రితమే చిన్నయిపై కోలీవుడ్ నిషేదాన్ని ఎత్తివేసింది.