శివ కార్తికేయన్  కోసం బిజు మీనన్

ABN , Publish Date - Aug 11 , 2024 | 08:11 PM

శివ కార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు.

శివ కార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో బీజు మీనన్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో బీజు మీనన్ ప్రజెన్స్ సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచింది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్, యూనిక్ సెట్టింగ్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందిస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్, మ్యాసీవ్ మూవీ. ఇందులో శివకార్తికేయన్ యూనిక్, స్టైలిష్ అవతార్ లో కనిపిస్తారు. రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Biju-Menon-SKXARM-Plain.jpg
సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రాఫ్.  

Updated Date - Aug 11 , 2024 | 08:11 PM