Aranmanai 4: ఈ అందాల‌కు.. 100 కోట్లు వ‌చ్చేసిన‌య్‌

ABN , Publish Date - May 24 , 2024 | 03:49 PM

సుంద‌ర్.సి మెయిన్ లీడ్‌గా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘అరణ్మనై-4’. తెలుగులో బాక్ గా విడుద‌లైంది. అగ్ర క‌థానాయిక‌లు త‌మ‌న్నా ,రాశిఖ‌న్నా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

Aranmanai 4: ఈ అందాల‌కు.. 100 కోట్లు వ‌చ్చేసిన‌య్‌
baak

సుంద‌ర్.సి (SundarC) మెయిన్ లీడ్‌గా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘అరణ్మనై-4’ (Aranmanai 4). అగ్ర క‌థానాయిక‌లు త‌మ‌న్నా (Tamannaah Bhatia), రాశిఖ‌న్నా (Raashii Khanna) ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా మే 3న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. తెలుగులో బాక్ (Baak) గా విడుద‌లైన ఈ మూవీ ఇక్క‌డా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది.

Baak.jpg

గత యేడాది విడుదలైన మూడో భాగం బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరచడంతో నాలుగో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుంద‌ర్ భార్య , ప్ర‌ముఖ న‌టి సతీమణి ఖుష్బూ ఈ సినిమాను నిర్మించారు. గ‌తంలో అర‌ణ్మై సిరీస్‌లో వ‌చ్చిన క‌ళావ‌తి, చంద్ర‌క‌ళ‌, అంత‌పురం మూడు చిత్రాల‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందగా వీట‌న్నింటినీ మించి తాజాగా విడుద‌లైన ‘అరణ్మనై-4’ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

aranmai.jpg


థిమేట‌ర‌ల్లో విడుద‌లై 20 రోజులు దాటినా త‌మిళ‌నాట ఎక్క‌డా వ‌సూళ్లు త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే రూ. 100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టడ‌మే కాక ఈ ఏడు త‌మిళ సినిమా హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.

baak.jpg

ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం రూ.60 కోట్ల మేరకు వసూలు చేసినట్టు కోలీవుడ్‌ ఫిల్మ్‌ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇదిలాఉండ‌గా ఈసినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు కూడా రెడీ అయింది. మే 31 నుంచి జీ5 (ZEE5) లో త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో బాక్ (Baak) ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

Baak.jpg

Updated Date - May 24 , 2024 | 03:49 PM