Rajinikanth: తలైవాకు శుభాకాంక్షల వెల్లువ..
ABN , Publish Date - Dec 12 , 2024 | 02:07 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు (Rajinikanth) ఏపీ సీఎం చంద్రబాబు (Nara Chandrabbau naidu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘నా ప్రియ మిత్రుడు, లెజెండరీ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాగించాలి అని చెప్పారు.
తన అద్భుతమైన నటనతో ఆరేళ్ల నుంచి ఆరవై ఏళ్ల వరకు అభిమానులను సొంతం చేసుకున్న నా మిత్రుడు రజనీకాంత్‌కు శుభాకాంక్షలు. మీరు సినీ పరిశ్రమలో ఎన్నో విజయాలను అందుకోవాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ నటనతో ప్రేక్షకులను ఇంకా మెప్పించాలని కోరుకుంటున్నా’’
- ఎంకే స్టాలిన్.
నా ప్రియమైన స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు ఇలాంటి విజయాలు మరిన్ని అందుకోవాలి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా
- కమల్ హాసన్
హ్యాపీ బర్త్‌డే రజనీకాంత్ గారు. రానున్న సంవత్సరం మీకు మరింత మంచి జరగాలని కోరుకుంటున్నా
- వెంకటేశ్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడూ మీకు వీరాభిమానినే. గ్రేట్ ఇయర్ సర్
- ఎస్‌జే సూర్య