Ajith Kumar: తమిళనాడు క్రీడా లోగోతో.. దుబాయ్‌ కార్‌ రేస్‌ పోటీల్లో అజిత్‌

ABN , Publish Date - Oct 31 , 2024 | 10:23 PM

దుబాయ్‌లోని ఆటోట్రామ్‌ రేస్‌ ట్రాక్‌లో పోర్షే జీటీ3 కప్‌ కార్‌ రేస్‌ ట్రయల్‌ పోటీల్లో అగ్రహీరో అజిత్‌ కుమార్ పాల్గొన్నారు.

ajith

దుబాయ్‌లోని ఆటోట్రామ్‌ రేస్‌ ట్రాక్‌లో పోర్షే జీటీ3 కప్‌ కార్‌ రేస్‌ ట్రయల్‌ పోటీల్లో అగ్రహీరో అజిత్‌ కుమార్ (Ajith Kumar) పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన లోగోతో ఆయన ఈ ట్రయల్‌ రన్‌లో పాలుపంచుకున్నారు. దుబాయ్‌ కేంద్రంగా జరిగే ఆటోడ్రోమ్‌ కార్‌ రేస్‌ పోటీలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి. ఈ రేస్‌ ప్రధాన పోటీలకు ముందు నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో అజిత్‌ పాల్గొని 350 కిలోమీటర్ల వేగంతో కారు నడిపారు. ఆ సమయంలో అజిత్‌ తన కారుపైన, క్రీడా పరికరాలపై తమిళనాడు క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన లోగో ఉపయోగించడంతో ప్రతి ఒక్కరూ ఆయనను అభినందిస్తున్నారు.

GbCt9bCbQAIDZig.jpeg

అజిత్‌కు ఉదయనిధి విషెస్‌..

అంతర్జాతీయ క్రీడా వేదికపై తమిళనాడు రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖకు మరింత గౌరవ ప్రతిష్ఠలు చేకూర్చేలా అజిత్‌ క్రీడా లోగోను ఉపయోగించారని రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదనిధి పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆయన బుధవారం ఒక ప్రటకన విడుదల చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సారథ్యంలోని ద్రావిడ మోడల్‌ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపేలా కృషి చేస్తుందన్నారు.

ఇందులో భాగంగా రాజధాని చెన్నై నగరంలో ఫార్ములా 4 చెన్నై రేసింగ్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ పేరుతో కార్ల పోటీని నిర్వహించగా, హీరో అజిత్‌కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు. ఇపుడు రాష్ట్ర క్రీడా రంగానికి మరింత వన్నె తెచ్చేలా ఆయన దుబాయ్‌ కార్‌ రేస్‌ ట్రయల్‌ రన్‌లో పాల్గొని, క్రీడా మంత్రిత్వ శాఖ లోగో ఉపయోగించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 10:23 PM