Shankar: ఇండియ‌న్‌3, గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత.. శంక‌ర్ చేసే సినిమాలేంటంటే!

ABN , Publish Date - Jul 04 , 2024 | 03:31 PM

క‌మ‌ల్ హాస‌న్, డైరెక్ట‌ర్ శంకర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ ‘భార‌తీయుడు 2’ జూలై 12న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో వీటి త‌ర్వాత చేయ‌బోయే చిత్రాల గురించి శంక‌ర్ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపారు.

Shankar

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Hassan), సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంకర్ (Shankar) కాంబినేష‌న్‌లో రూపొందిన‌ భారీ చిత్రం ‘భార‌తీయుడు 2’(Indian2). జూలై 12న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా దేశ వ‌వ్యాప్తంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు చెప్పిన స‌మాధానంతో అభిమానులు ఇప్ప‌టినుంచే మాట్లాడుకోవ‌డం మొద‌లు పెట్టారు.

Shankar

వివ‌రాల్లోకి వెళితే.. ప్రస్తుతం శంక‌ర్ (Shankar) రూపొందించిన ‘ఇండియన్‌-2’ (Indian2) ఈ నెల 12న విడుదలకానుంది. ఆ తర్వాత టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘ఇండియన్‌-3’ (Indian 3)పై దృష్టి సారించనున్నారు. ఈ రెండు సినిమాల పనులన్నీ కొన్ని నెలల్లో పూర్తి కానున్నాయి.


Shankar

ఆ తర్వాత ఎలాంటి చిత్రాలను నిర్మిస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు శంకర్‌ సమాధానమిస్తూ, ‘ప్రస్తుతం నా వద్ద హిస్టారికల్‌, జేమ్స్‌ బాండ్‌, సైన్స్‌ ఫిక్షన్ వంటి మూడు స్టోరీలున్నట్టు వెల్లడించారు. అయితే, ఈ మూడు భారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే చిత్రాలు. వీటి నిర్మాణలో ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలు, కొత్త టెక్నాలజీతో పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని సమాధానమిచ్చారు. ఇదిలాఉండ‌గా సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్‌ చిత్రాలకు పునాదులు వేసిన దర్శకుల్లో శంకర్‌ మొదటి వరుసలో ఉండ‌గా ఆ సినిమాల కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

Updated Date - Jul 04 , 2024 | 03:31 PM