Aditi Rao Hydari: అతని వల్లే మార్పు.. ప్రేమపై నమ్మకం పెరిగింది
ABN , Publish Date - May 07 , 2024 | 02:57 PM
నిశ్చితార్థం తర్వాత తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అదితీరావు హైదరీ. అతని వల్లే తనకు ప్రేమపై నమ్మకం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే!
నిశ్చితార్థం తర్వాత తనకు కాబోయే భర్త Siddharth గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అదితీరావు హైదరీ(Aditi Rao Hydari) అతని వల్లే తనకు ప్రేమపై నమ్మకం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే! త్వరలో ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. తాజాగా అదితీరావు హైదరీ నటించిన 'హీరామండి’ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడారు. ‘సిద్థార్థ్ ( Siddharth loves adithirao) పరిచయం నన్నెంతో మార్చింది. అతడు వల్లే ప్రేమపై నమ్మకం మరింత పెరిగింది. ఎన్నో విషయాల్లో నా నమ్మకం నిజమైంది. మా ఇద్దరిది చిన్నపిల్లల స్వభావం. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పనిసరిగా ఉంటుంది. మేమిద్దరం ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం. నేను ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటాను. నటీనటులపై రూమర్స్ రావడం కామన్ . మా ఇద్దరుపై చాలా రూమర్లు వచ్చాయి. వాటికి చెక్ పెట్టేందుకే నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు తెలియజేశాం. విషయం తెలుసుకున్న చాలామంది సంతోషించి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లందరికీ థ్యాంక్స్. వాళ్ల అభిమానం ఎంతో విలువైనది’ అని అన్నారు.
సోషల్ మీడియా గురించి కూడా ఆమె మాట్లాడారు. ‘సెలబ్రిటీలు కూడా మనుషులే అని ప్రజలు గ్రహించాలి. వాళ్ల చుట్టూ తిరిగి వాళ్ల వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడం తప్పని అర్థం చేసుకోవాలి. వారి గోప్యతకు భంగం కలిగించకూడదు అని నెటిజన్లు భావించాలి. అందరికీ చెప్పే విషయమైతే నటీనటులు నేరుగా చెబుతారు’’ అని అన్నారు.