Actress: Rohini: హేమ కమిటీ రిపోర్ట్‌.. రోహిణి కీలక వ్యాఖ్యలు!

ABN , Publish Date - Sep 08 , 2024 | 05:03 PM

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Committee Report) దేశవ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.


జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Committee Report) దేశవ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కమిటీ ఇచ్చిన నివేదికతో వేధింపులకు గురైన నటీనటులు ధైౖర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీడియా ఎదుట తమ సమస్యలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటి రోహిణి (Rohini) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం  జరిగిన నడిగర్‌ సంఘం మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఈ నివేదికను సిద్థం చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండీషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. క్యాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ రిపోర్ట్‌ వైరల్‌గా మారిన తరుణంలో పలువురు నటీమణులు మీడియా ముందుకు వచ్చి తమకు ఎదురైన వేధింపులు బయటపెట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్‌, నటుడు జయసూర్య, మణియన్‌ పిళ్ల రాజుపై కేసులు నమోదు అయ్యాయి. ఇదే తరహా కమిటీని కోలీవుడ్‌లోనూ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఇటీవల నటుడు విశాల్‌ తెలిపిన విషయం తెలిసిందే.

Updated Date - Sep 08 , 2024 | 05:18 PM