Nikhila Vimal: ఆ పాత్రకు తగ్గట్టు.. దర్శకుడు నన్ను మలుచుకున్నాడు
ABN , Publish Date - Oct 15 , 2024 | 10:49 AM
తాను ఒక పరికరాన్ని మాత్రమేనని, దర్శకుడు తనకు నచ్చిన రీతిలో మలచుకున్నారని హీరోయిన్ నిఖిలా విమల్ అన్నారు.
తాను ఒక పరికరాన్ని మాత్రమేనని, దర్శకుడు తనకు నచ్చిన రీతిలో మలచుకున్నారని హీరోయిన్ నిఖిలా విమల్ (Nikhila Vimala) అన్నారు. మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో ఆయన స్వీయ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘వాళై’(Vaazhai). ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది.
ఈ సినిమాలో పూంగొడి టీచర్‌గా కీలక పాత్రలో నటించిప్రేక్షకులను మెప్పించిన నిఖిలా విమల్ (Nikhila Vimala) చిత్రంలో నటించిన తన అనుభవం, పూంగొడి టీచర్ పాత్రను దర్శకుడు మలిచిన తీరు వర్ణించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వాళై’ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయం. ఆ పాత్రకు తగినట్టుగా దర్శకుడు నన్ను మలుచుకున్నారన్నారు.
నేను ఒక పరికరాన్ని మాత్రమే. ‘కర్ణన్’ చిత్రంలో హీరోయిన్ రజీషా విజయన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చెన్నైకి రాగా ఆ సమయంలోనే ‘వాళై’ (Vaazhai)చిత్రం గురించి దర్శకుడు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం చిత్రాన్ని నిర్మించి, అందులో నా కెరీర్లో నిలిచిపోయే పాత్రను ఇచ్చిన దర్శకుడికి రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.