Hot Spot 2Much: విష్ణు విశాల్‌ సమర్పణలో.. ‘హాట్‌స్పాట్‌’ సీక్వెల్‌ ‘హాట్‌స్పాట్ 2మ‌చ్‌’

ABN , Publish Date - Aug 11 , 2024 | 02:18 PM

సమాజంలోని నాలుగు వేర్వేరు అంశాలతో హైపర్‌ లింక్‌ సోషియో డ్రామా మూవీగా తెరకెక్కి ఈ యేడాది విడుదలై ప్రేక్షకాదారణ పొందిన చిత్రం ‘హాట్‌స్పాట్ 2మ‌చ్‌’కు రెండో భాగం ప‌ట్టాలెక్కింది.

hotspot

సమాజంలోని నాలుగు వేర్వేరు అంశాలతో హైపర్‌ లింక్‌ సోషియో డ్రామా మూవీగా తెరకెక్కి ఈ యేడాది విడుదలై ప్రేక్షకాదారణ పొందిన చిత్రం ‘హాట్‌స్పాట్‌’ (Hotspot) కు రెండో భాగం రానుంది. విష్ణువిశాల్‌ స్టూడియోస్‌ పతాకంపై హీరో విష్ణువిశాల్ (Vishnu Vishal) సమర్పణలో కేఏబీ టాకీస్ (KJB Talkies), సెవెన్‌ వారియర్స్ (Sevenwarrior) నిర్మాణంలో నిర్మాత కేవీ దురై పర్యవేక్షణలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ విషయాన్ని ఇటీవ‌ల‌ అధికారికంగా వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా విష్ణు విశాల్ (Vishnu Vishal) మాట్లాడుతూ... ‘హట్‌స్పాట్‌’ (Hotspot) తొలి భాగాన్ని ఓటీటీలో చూశా. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చి పాజిటివ్‌ రెస్పాన్స్‌ చూసి ఆశ్చర్యపోయా. నేను లేకుంటే ఈ సినిమాకు సీక్వెల్‌ వచ్చేది కాదని చాలా మంది అంటున్నారు. ఆ వ్యాఖ్యలతో ఏకీభవించను. మంచి చిత్రం ఏదో రూపంలో వచ్చి తీరుతుంది. అలా ఈ రెండో భాగానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. నా 15 యేళ్ల సినీ అనుభవంలో మంచి కథలను ఎంపిక చేసుకోసుకోవడం నేర్చుకున్నా నిర్మాతగా మారా అన్నారు. విష్ణు విశాల్‌ (Vishnu Vishal) స్టూడియో భవిష్యత్తులో మంచి సినిమాలను నిర్మిస్తుంది’ అని పేర్కొన్నారు.

GUm9mBuWwAENAn7.jpeg


దర్శకుడు విఘ్నేష్‌ కార్తీక్ (vignesh karthick) మాట్లాడుతూ.. ‘హాట్‌స్పాట్‌’ (Hotspot) కు ప్రేక్షకుల స్పందన కంటే మీడియాలో వచ్చిన రివ్యూలు బలంగా నిలిచాయి. ఇప్పుడు ‘హాట్‌స్పాట్‌’ (HotSpot2Much) రెండో భాగానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. విష్ణు విశాల్ (Vishnu Vishal) చేతులు కలపడం సంతోషంగా ఉందని.. రెండో భాగం కూడా మొదటి భాగంలానే ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

GUm9l5xWoAAjkz4.jpeg

Updated Date - Aug 11 , 2024 | 02:18 PM