Vishal: నాకు.. రెడ్ కార్డ్ చూపిస్తున్నారా?

ABN , Publish Date - Aug 12 , 2024 | 07:48 AM

తనకు తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి పరోక్షంగా రెడ్‌కార్డ్‌ చూపిస్తుందా? అంటూ హీరో విశాల్ ప్రశ్నించారు. తనపై నిర్మాతల మండలి చేసిన పలు ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై వివరణ కోరుతూ నిర్మాతల మండలికి ఆయన లేఖ రాశారు.

vishal

తనకు తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి పరోక్షంగా రెడ్‌కార్డ్‌ చూపిస్తుందా? అంటూ హీరో విశాల్ (Vishal) ప్రశ్నించారు. తనపై నిర్మాతల మండలి చేసిన పలు ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై వివరణ కోరుతూ నిర్మాతల మండలికి ఆయన లేఖ రాశారు.

గత నెల 26న నిర్మాతల మండలి లేఖ విడుదల చేసింది. అందులో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్‌ ఉన్న సమయంలో రూ.12 కోట్ల మేరకు నిధుల దుర్వినియోగం జరిగినట్టు ప్రత్యేక ఆడిటర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని, భవిష్యత్తులో విశాల్‌(Vishal)తో సినిమాలు తీయాలని భావించే వారు ముందుగా నిర్మాతల మండలితో చర్చించాలని కోరింది.


Vishal.jpg

దీనిపై విశాల్‌ (Vishal) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్మాతల మండలి ఇన్‌చార్జ్‌గా ఉన్న నిర్మాత కదిరేశన్‌, ఇతర కార్యవర్గ సభ్యుల అనుమతితో నిధులను సంక్షేమానికి ఖర్చు చేశామన్నారు. ఆ నిధులు కూడా లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా బదిలీ చేశామన్నారు.

కానీ, నాతో సినిమాలు తీసేవారు నిర్మాతల మండలితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? నాతో సినిమాలు తీసే నిర్మాతలు, నాతో కలిసి పనిచేసే టెక్నీషియన్లు నిర్మాతల మండలితో ఎందుకు చర్చించాలి. విశాల్ (Vishal) అనే నటుడికి నిర్మాతల సంఘం పరోక్షంగా రెడ్‌ కార్డ్‌ చూపిస్తుందా? అని తన ప్రకటనలో ప్రశ్నించారు.

Updated Date - Aug 12 , 2024 | 07:48 AM