Vishal: చిత్ర పరిశ్రమపై.. ప్రభుత్వం జోక్యం చేసుకోవ‌ద్దు

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:25 PM

రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఆహ్వానిస్తే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందేనని హీరో విశాల్ అన్నారు. ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు.

vishal

రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఆహ్వానిస్తే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందేనని హీరో విశాల్ (Vishal) అన్నారు. ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. ‘నేను రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది ప్రజలు నిర్ణయించాలి. రాజకీయాల్లోకి రావాలని వారు ఆహ్వానిస్తే వచ్చి తీరాల్సిందే. ప్రజలకు అన్ని సౌకర్యాలు లభిస్తే సినిమా హీరోలు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు. ప్రజలు కష్టపడుతున్నారని, వారిని ఆదుకునేందుకే సినీ హీరోలు రాజకీయాల్లోకి వస్తున్నారు.


Vishal.jpg

చిత్రపరిశ్రమలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు. గత త‌మిళ‌నాడు ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరూ ఇండస్ట్రీలో జోక్యం చేసుకోలేదు. సినిమా పరిశ్రమను అలాగే ఉండనిస్తే చాలు. రాష్ట్రంలో రెండు రకాల జీఎస్టీలు వసూలు చేస్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఈ విధానంలో మార్పులేదు. చిత్రపరిశ్రమ కష్టాల్లో ఉంది. చిన్న చిత్రాలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుగొని చిన్న నిర్మాతలను బతికించాలి’ అని కోరారు.

Updated Date - Jul 26 , 2024 | 04:31 PM