Vijay Sethupathi: ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌గా విజయ్‌ సేతుపతి?

ABN , Publish Date - Aug 14 , 2024 | 02:48 PM

బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో ప్రజాదారణ పొందిన బిగ్‌బాస్‌ తమిళ రియాలిటీ షో ఎనిమిదో సీజన్‌కు ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించనున్నారంటూ ప్రచారం సాగుతోంది.

biggboss

బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో ప్రజాదారణ పొందిన బిగ్‌బాస్‌ తమిళ (Big Boss Season8) రియాలిటీ షో ఎనిమిదో సీజన్‌కు ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi)హోస్ట్‌గా వ్యవహరించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. గత ఏడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన అగ్రహీరో కమల్‌ హాసన్ (Kamal Haasan) వచ్చే సీజన్‌ నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో కొత్త హోస్ట్‌ ఎవరన్న అంశంపై ఇపుడు ఆసక్తి నెలకొంది.

GU6PTbaa4AElaRx.jpeg

తొలుత సూర్య, శింబు, శివకార్తికేయన్‌ పేర్లు తెరపైకి రాగా, ఇపుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) పేరు వినిపిస్తోంది. హీరో సూర్య తన ప్రాజెక్టులు ‘సూర్య44’, ‘కంగువా-2’తో బిజీగా ఉండటంతో ఆయన నో చెప్పారు. ఆ తర్వాత విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) ని సంప్రదించగా, ఆయన సూచనప్రాయంగా అంగీకచించినట్టు బిగ్‌బాస్‌ (Big Boss Tamil) వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.


GU6fhLtbcAAlFT8.jpeg

సినిమాలో హీరో, విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, గెస్ట్‌ రోల్‌, వెబ్‌ సిరీస్‌, బుల్లితెర యాంకర్‌ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఎలాంటి ఇమేజ్‌ చూడకుండా రాణిస్తున్నారు. పైగా గతంలో ‘నమ్మ ఊరు హీరో, మాస్టర్‌ చెఫ్‌’ వంటి వారికి యాంకర్‌గా వ్యవహరించారు. అందుకే బిగ్‌బాస్ (Big Boss Tamil) నిర్వాహకులు సైతం విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది.

Updated Date - Aug 14 , 2024 | 02:48 PM