Vijay Antony: ఈ సారి.. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌తో వ‌స్తున్న విజ‌య్ అంటోని

ABN , Publish Date - Oct 16 , 2024 | 07:15 PM

నటుడిగా, దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు విజయ్ ఆంటోనీ. తాజాగా ఆయ‌న ఈ సారి మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు.

vijay

నటుడిగా, దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు విజయ్ ఆంటోని (Vijay Antony). మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ ఫిక్షన్ ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్లేందుకు గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. విజయ్ ఆంటోని (Vijay Antony) ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సగర్వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ (leo john paul) దర్శకత్వం వహించారు. ఈ మూవీ టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘గగన మార్గన్’ (Gagana Maargan) అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

GZ_VXRYb0AMmDYH.jpeg

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఆంటోని (Vijay Antony) రెండు రకాలుగా కనిపించారు. గాయపడి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ లుక్ కొత్తగా ఉంటే.. నీటి అడుగు బాగాన ఉన్న వ్యక్తి పోస్టర్ కూడా ఇందులో కనిపిస్తోంది. "అట్టకత్తి", "బీడ", "సూదు కవ్వుం", "ఇంద్రు నేత్ర నాళై", "తేకడి", "ముండాసుపట్టి", "కదలుం కాదందు పోగుం", "ఏ1", "మాయవన్" వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్న లియో జాన్ పాల్.. ‘గగన మార్గన్’(Gagana Maargan) తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

GaA4er5bcAAXzxO.jpeg

2013లో త‌మిళంలో వ‌చ్చిన "ఇదర్‌కుతానే ఆసైపట్టై బాలకుమార" చిత్రానికి గాను లియో జాన్ పాల్ (leo john paul) ఉత్తమ ఎడిటర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును సైతం గెలుచుకున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ వంటి వారు నటించారు. యువ సినిమాటోగ్రాఫర్‌గా, రాజా ఆర్ట్ డైరెక్టర్‌గా, విజయ్ ఆంటోని (Vijay Antony) మ్యూజిక్ కంపోజర్‌గా పని చేశారు. ముఖ్యంగా ఈ చిత్రానికి ముంబైలో చిత్రీకరించిన నీటి అడుగున సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

GaA4eF8a4AEp9X8.jpeg

Updated Date - Oct 16 , 2024 | 07:53 PM