Kalakalappu3: వ‌డివేలు, సుందర్ సి.. 14 ఏండ్ల త‌ర్వాత ఇంట్రెస్టింగ్ కాంబినేస‌న్‌

ABN , Publish Date - Jun 21 , 2024 | 09:40 AM

ప్రముఖ దర్శక నటుడు సుందర్ సి మరోమారు దెయ్యం స్టోరీతోనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో సీనియర్‌ హాస్య నటుడు వడివేలు ముఖ్య పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది.

Kalakalappu3: వ‌డివేలు, సుందర్ సి.. 14 ఏండ్ల త‌ర్వాత ఇంట్రెస్టింగ్ కాంబినేస‌న్‌
vadivelu

ప్రముఖ దర్శక నటుడు సుందర్ సి (Sundar C) మరోమారు దెయ్యాన్ని నమ్ముకున్నారు. దెయ్యం స్టోరీతో ‘అరణ్మనై’ (Aranmanai)సిరీస్‌ పేరుతో ఇప్పటివరకు ఆయన తీసిన నాలుగు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో మరోమారు దెయ్యం స్టోరీతోనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో సీనియర్‌ హాస్య నటుడు వడివేలు (Vadivelu) ముఖ్య పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది.

గతంలో సుందర్ సి (Sundar C), వడివేలు (Vadivelu) కాంబినేషన్‌లో వచ్చిన ‘తలైనగరం’, ‘విన్నర్‌’ వంటి చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ చిత్రాల్లో వడివేలు కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వారు. ఇపుడు మళ్లీ వీరిద్దరు కలిసి ఒక ప్రాజెక్టు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో ప్ర‌స్తుత త‌మిళ సెన్షేష‌న్ కెవిన్ హీరోగా న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు బాగా వ‌చ్చిన‌ప్ప‌టికీ అవి రూమ‌ర్సే అని తేలిపోయాయి. అయితే ఈ చిత్రం దెయ్యం స్టోరినీ లేక పాత వాటిలా కామెడీ బేస్ చిత్రాల అనేది తెలియాల్సి ఉంది.

GP1uD7jWEAAZ4Y2.jpeg


గతంలో సుందర్‌ సి (Sundar C)తెరకెక్కించి రెండు భాగాలుగా వచ్చిన ‘కలగలప్పు’ (Kalakalappu) చిత్రం మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేసినట్టు సమాచారం. క‌థానాయుక‌గా వాణి భోజ‌న్ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి రెండు భాగాల్లో ఉన్న నటులు విమల్ ( Vimal ), శివ (Siva) కూడా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Updated Date - Jun 21 , 2024 | 03:23 PM