Moon Walk : ప్రభుదేవా , AR రెహ్మాన్‌ కాంబో ‘మూన్‌వాక్‌’

ABN , Publish Date - Jun 21 , 2024 | 10:11 AM

ప్రభుదేవా, ఏఆర్‌ రెహ్మాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు ‘మూన్‌వాక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చెన్నై నగరంలో శరవేగంగా జరుపుకుంటుంది.

Moon Walk : ప్రభుదేవా , AR రెహ్మాన్‌ కాంబో ‘మూన్‌వాక్‌’
Moon Walk

బిహైండ్‌వుడ్స్ (Behindwoods) సమర్పణలో ప్రభుదేవా (Prabhudheva), ఏఆర్‌ రెహ్మాన్ (AR Rahman) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు ‘మూన్‌వాక్‌’ (Moon Walk)అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

MOON WALK

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్న ఏఆర్‌.రెహ్మాన్‌, ప్రభుదేవా కాంబో మళ్ళీ 25 యేళ్ళ తర్వాత కలిసి పనిచేస్తుంది. ఏఆర్‌ఆర్‌పీడీ6 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళగా, ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చెన్నై నగరంలో శరవేగంగా జరుపుకుంటుంది.

MOON WALK


వినోదాత్మక అంశాలతో వినోదాత్మక కుటుంబ సభ్యులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో ప్రభుదేవా (Prabhudheva), యోగిబాబు (Yogi Babu), అజు వర్గీస్ (Aju Varghese), అర్జున్‌ అశోకన్ (ArjunAshokan ), చాట్స్‌, నిష్మా చెంగ‌ప్ప (Nishma Chengappa) సుష్మిత నాయ‌క్ (Sushmitha Nayak) తదితరులు నటిస్తున్నారు.

MOON WALK

బిహైండ్‌వుడ్స్‌ సమర్పణలో మనోజ్‌ ఎన్‌ఎ్‌స, దివ్య మనోజ్‌, ప్రవీణ్‌ ఇలాక్‌లు నిర్మించే ఈ చిత్రానికి బిహైండ్‌వుడ్స్‌ కంపెనీ సీఈవో మనోజ్‌ ఎన్‌ఎస్‌(Manoj NS) దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - Jun 21 , 2024 | 10:11 AM