Thalaimai Seyalagam: శ్రియారెడ్డి ప్రధాన పాత్రలో ‘తలమై సెయల్గమ్’.. టీజర్, స్ట్రీమింగ్ డేట్ వచ్చేశాయ్
ABN , Publish Date - May 04 , 2024 | 07:52 PM
భారతదేశంలోని అతి పెద్ద ఓటీటీ మాధ్యమం Zee5 ఇప్పుడు సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌కు శ్రీకారం చుట్టింది. ‘తలమై సెయల్గమ్’ పేరుతో తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై జాతీయ అవార్డ్ గ్రహీత వసంతబాలన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్ రూపొందించారు.
భారతదేశంలోని అతి పెద్ద ఓటీటీ మాధ్యమం Zee5 ఇప్పుడు సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌కు శ్రీకారం చుట్టింది. ‘తలమై సెయల్గమ్’ (Thalaimai Seyalagam) పేరుతో తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై జాతీయ అవార్డ్ గ్రహీత వసంతబాలన్ (Director Vasanthabalan) దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar) రూపొందించారు. మే 17 నుంచి Zee5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కిషోర్ (Kishore), శ్రియారెడ్డి (Shriya Reddy), ఆదిత్య మీనన్ (Adithya Menon), భరత్ (Bharath) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడు (Tamil Nadu)లో రాజకీయాల మధ్య ఒక మహిళ అధికార దాహం, ఆశయం, ద్రోహం, విమోచనాలను తెలియజేసే కథాంశంతో ఇది తెరకెక్కిందని ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.
*Salaar: ‘సలార్’ జపాన్‌లో సందడికి డేట్ ఫిక్సయింది.. ట్రైలర్ కూడా వదిలారు
టీజర్ విషయానికి వస్తే.. ఇది తమిళ రాజకీయాల చుట్టూ నడిచే కథాంశం. ముఖ్యమంత్రి అరుణాచలం అవినీతి ఆరోపణలతో 15 సంవత్సరాలుగా విచారణను ఎదుర్కొంటుంటారు. ముఖ్యమంత్రి కావాలని, ఆ పదవి కోసం వారిలో ఇది కోరికను మరింతగా పెంచుతుంది. ఇదిలా ఉండగా జార్ఖండ్‌లోని మారుమూల పల్లెటూరులో, రెండు దశాబ్దాల క్రితం జరిగిన పాత మర్డర్ కేసుని సీబీఐ ఆఫీసర్ వాన్ ఖాన్ పరిశోధిస్తుంటారు. అదే సమయంలో చెన్నై నగరంలో తల, శరీరభాగాలు వేరు చేయబడిన ఓ శరీరం దొరుకుతుంది. ఈ భయంకర ఘటనకు కారకులైన వారిని కనిపెట్టడానికి చెన్నై డీజీపీ మణికందన్ పరిశోధన చేస్తుంటారు. క్రమక్రమంగా నగరంలో జరుగుతున్న ఈ దుర్ఘటనల వెనుకున్న నిజమేంటనేది బయటకు వస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. (Thalaimai Seyalagam Teaser)
టీజర్ విడుదల సందర్భంగా రాడాన్ మీడియా వర్క్స్ అధినేత, నిర్మాత రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘తలమై సెయల్గమ్’ సిరీస్‌ను జీ 5తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందించటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. జాతీయ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల ప్రభావంతో పాటు జార్ఖండ్‌లోని కింది స్థాయి కార్యకర్తలు, తిరుగుబాటు గ్రూపుల మధ్య ఉండే సంక్లిష్ట పరిస్థితులను ఇందులో చూపించాం. రాజకీయ వారసత్వానికి అతీతంగా ఓ మహిళ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే పరిస్థితులపై సిరీస్‌ను రూపొందించాం. తప్పకుండా ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. డైరెక్టర్ వసంతబాలన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఏ నియమాలు వర్తించవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గొంతులను నిశితంగా విన్నప్పుడు.. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, రాష్ట్ర స్వయం సమృద్ధి, ప్రజల హక్కుల ప్రాథమిక అవసరానికి గొంతుకగా అవి మారాయని అర్థం చేసుకున్నప్పుడు కొత్త రాజకీయం పుట్టుకొస్తుంది. అవినీతి, దీని కారణంగా జరిగే ప్రమాదాలు, దీన్ని ఎదుర్కోవటం కోసం చేసే పోరాటాల్లో భాగమై ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం, ముఖ్యమంత్రిని గురించి ఈ సిరీస్ తెలియజేస్తుందని తెలిపారు. నటి శ్రియా రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో నేను కొట్రవై అనే పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సిరీస్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నేను కూడా జీ5లో ఈ సిరీస్‌ను చూసేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. (Thalaimai Seyalagam Streaming Date Out)