Rautu Ka Raaz: ‘రౌతు కా రాజ్’.. ఓటీటీలో థ్రిల్ చేస్తోన్న మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్

ABN , Publish Date - Jun 29 , 2024 | 10:03 PM

జీ 5 డైరెక్ట్ డిజిట‌ల్ ఫిల్మ్ ‘రౌతు కా రాజ్’ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. ఈ థ్రిల్లింగ్ మిస్ట‌రీ ఫిల్మ్‌ను ఆనంద్ సురాపూర్ ద‌ర్శ‌క‌త్వంలో జీ స్టూడియోస్, ఫాట్ ఫిష్ రికార్డ్స్ నిర్మించాయి. బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి పాత్ర‌లో న‌టించారు. తాజాగా జీ 5 ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.

Rautu Ka Raaz: ‘రౌతు కా రాజ్’.. ఓటీటీలో థ్రిల్ చేస్తోన్న మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్
Rautu Ka Raaz Movie Still

జీ 5 డైరెక్ట్ డిజిట‌ల్ ఫిల్మ్ ‘రౌతు కా రాజ్’ (Rautu Ka Raaz) చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. ఈ థ్రిల్లింగ్ మిస్ట‌రీ ఫిల్మ్‌ను ఆనంద్ సురాపూర్ ద‌ర్శ‌క‌త్వంలో జీ స్టూడియోస్, ఫాట్ ఫిష్ రికార్డ్స్ నిర్మించాయి. బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి పాత్ర‌లో న‌టించారు. ఉత్తరాఖండ్‌లోని రౌతు కీ బేలి అనే పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజేష్ కుమార్, అతుల్ తివారీ, నారాయణి శాస్త్రి కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది జీ5లో విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న ‘హడ్డీ’ తర్వాత జీ5, జీ స్టూడియోస్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో విడుదలకు ముందే ‘రౌతు కా రాజ్’పై భారీ అంచనాలను నెలకొన్నాయి. జీ5లోకి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులను అంత స్థాయిలో ఈ చిత్రం థ్రిల్ చేస్తోందని మేకర్స్ తెలిపారు. (A ZEE5 Original Film)

Also Read- Actor Sivaji: ‘కూర్మనాయకి’లో శివన్నగా శివాజీ.. లుక్ అదిరింది


కథ విషయానికి వస్తే.. పదిహేనేళ్లుగా హత్య వంటి పెద్ద నేరం జరగని ఒక పట్టణంలోని అంధుల పాఠశాలలో వార్డెన్ అనుమానాస్పదంగా మరణిస్తాడు. అత‌న్ని ఎవ‌రు.. ఎందుకు చంపార‌నే పాయింట్ మీద రౌతు కా రాజ్ సినిమాను రూపొందించారు. ఆ ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేష‌న్‌లోని స్టేష‌న్ హెడ్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి (న‌వాజుద్దీన్ సిద్ధిఖీ), స్టేష‌న్‌లోని ఇన్‌స్పెక్ట‌ర్ దిమ్రి (రాజేష్ కుమార్‌)తో క‌లిసి కేసుని ఛేదించ‌టానికి రంగంలోకి దిగుతాడు. సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల మ‌ధ్య‌ చ‌క్క‌టి హాస్యం క‌ల‌గ‌లిసిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించారు. 54వ ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో గాలా ప్రీమియ‌ర్‌గా చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుందీ చిత్రం. ఇప్పుడీ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.


Rautu-Ka-Raaz.jpg

ఈ సంద‌ర్భంగా న‌వాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) మాట్లాడుతూ.. ‘‘క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కుల్లో నేను ఒక‌డిని. రౌతు కా రాజ్ సినిమా విష‌యానికి వ‌స్తే ఎవరూ ఊహించ‌ని ట్విస్టుల‌తో ప్రేక్ష‌కుల‌కు ఇది న‌చ్చుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌జ‌లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంటారు అనే నేప‌థ్యంలో ప్ర‌ధాన పాత్ర‌ల మ‌ధ్య చ‌క్క‌టి చ‌మ‌త్కరాన్ని రంగరించి దర్శకుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇప్పుడీ సినిమాను 190కి పైగా దేశాల్లో జీ 5 ద్వారా ప్రేక్ష‌కులు చూడొచ్చు. కచ్చితంగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందీ చిత్రం’’ అని అన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 10:03 PM