Squid Game 2 Teaser: ఈసారి ద‌బిడి దిబిడే.. స్క్విడ్ గేమ్2 టీజ‌ర్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:55 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్న ఆప్డేట్ రానే వ‌చ్చింది. రెండు సంవ‌త్స‌రాల క్రితం అనామ‌కంగా ఓటీటీలోకి వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సీజ‌న్ 2 విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

Squid Game2

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్న ఆప్డేట్ రానే వ‌చ్చింది. రెండు సంవ‌త్స‌రాల క్రితం అనామ‌కంగా ఓటీటీలోకి వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించిన స్క్విడ్ గేమ్ (Squid Game) వెబ్ సిరీస్ సీజ‌న్ 2 విడుద‌ల‌కు రెడీ అవుతోంది. అ క్ర‌మంలో తాజాగా మేక‌ర్స్ ఈ సీజ‌న్‌2కు సంబంధించిన స్పెష‌ల్ టజ‌ర్‌ను రిలీజ్ చేయ‌డంతో పాటు సిరీస్ విడుద‌ల తేదీనీ కూడా ప్ర‌క‌టించారు. ఇప్పుడీ వార్త సోష‌ల్ మీడియాలో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ది గేమ్ విల్ నాట్ స్టాప్ అంటూ రిలీజ్ చేసిన టీజ‌ర్ క్షణాల్లోనే మిలిమ‌న్ల కొద్ది వ్యూస్ ద‌క్కించుకుంటూ స‌రికొత్త రికార్టును క్రియేట్ చేస్తోంది.

Squid Game2

మొద‌టి సీజ‌న్‌లో స్క్విడ్ గేమ్ (Squid Game) గెలిచిన 456 నంబ‌ర్ ప్లేయ‌ర్ బ‌య‌టి దేశాల‌కు వెళ్లాల‌నుకున్న నిర్ణ‌యాన్ని మార్చుకుని 45.6బిల‌య‌న్ డాల‌ర్లు గెలవాల‌ని తిరిగి గేమ్‌ ఆడ‌డానికి రావ‌డంతో ఈ సిరీస్ ప్రారంభ‌మ‌వుతుంది. అయితే మొద‌టి సీజ‌న్‌ను మించి డిఫ‌రెంట్ రూల్స్‌తో, టాస్కుల‌తో, ట్విస్టుల‌తో ఓళ్లు గ‌గుర్పొడిచేలా ఈ సీజ‌న్‌ను రూపొందించారు. సీజ‌న్ 1లో న‌టించిన లీ జంగ్ జే (Lee Jung-jae), పార్క్ హే సూ, హోయాన్ జంగ్‌ల‌తో పాటు కొత్త‌గా యిమ్ సి-వాన్ (Im Si-wan), కాంగ్ హా-న్యూల్, పార్క్ గ్యు-యంగ్, లీ జిన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మొద‌టి సిరీస్‌ను తెర‌కెక్కించిన హ్వాంగ్ డాంగ్-హ్యూక్ (Hwang Dong-hyuk) ఈ సెకండ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Squid Game2

దాదాపు 3 సంవ‌త్స‌రాల త‌ర్వాత వ‌స్తున్న ఈ స్క్విడ్ గేమ్2లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉండ‌గా డిసెంబ‌ర్ 26 నుంచి స్టీమింగ్ చేయ‌నున్న‌ట్లు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా ప్ర‌క‌టించి టీజ‌ర్ విడుద‌ల చేసింది. టీజ‌ర్ విడుద‌ల చేసిన 10 గంట‌ల్లోనే 400K పైగా వ్యూస్ సాధించి ఈ సిరీస్ ప్ర‌త్యేక‌త ఏంటో నిరూపించింది. మీరు ఇంత‌వ‌రకు ఈ Squid Game: Season 2 టీజ‌ర్ చూడ‌లేదా ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే చూసేయండి మ‌రి.

Squid Game2

Updated Date - Sep 20 , 2024 | 06:08 PM