GAAMI: ఓటీటీలోకి.. విశ్వక్ సేన్ నటించిన అరుదైన, ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్! డోంట్ మిస్

ABN , Publish Date - Apr 03 , 2024 | 09:02 PM

ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు హనుమాన్ చిత్రాన్ని తీసుకువచ్చిన జీ5 తాజాగా మరో కొత్త సినిమాతో పలకరించటానికి సిద్ధమైంది.

GAAMI: ఓటీటీలోకి.. విశ్వక్ సేన్ నటించిన అరుదైన, ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్! డోంట్ మిస్
gaami

ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు హనుమాన్ చిత్రాన్ని తీసుకువచ్చిన జీ5 (ZEE 5) తాజాగా మరో కొత్త సినిమాతో పలకరించటానికి సిద్ధమైంది. అదే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో నటించిన ‘గామి’(Gaami). విశ్వక్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది.

కథ విషయానికి వస్తే.. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) తనను ఎవరైనా టచ్ చేస్తే చాలు శరీరం రంగు మారి తీవ్ర నొప్పులతో బాధ పడి ఓ పూట స్పస్శను కోల్పోయే వింత సమస్యతో బాధ పడుతుంటాడు. దాంతో ఎక్కడికి వెళ్లకుండా.. అక్కడే ఉంటుంటాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలని తెలుస్తుంది.

Gaami.jpg

అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం.


థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచే పబ్లిక్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ గామి (Gaami) సినిమా అన్ని వర్గాల ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు.. అంతా చూడాల్సిన సినిమాగా, తెలుగులో అరుదుగా వచ్చే చిత్రంగా గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాను ఉగాది సందర్భంగా జీ 5 (ZEE 5) ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నారు. థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సమేతంగా చూసి ఆస్వాధించవచ్చు. చేయనుండటం విశేషం.

GKPud_0XoAAkV06.jpg

నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ గామి (Gaami) జీ5 (ZEE 5) ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరించటానికి ఏప్రిల్ 12న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సిద్ధమైంది.

Updated Date - Apr 03 , 2024 | 09:02 PM