Toofan: చ‌ప్పుడులేకుండా ప‌ది రోజుల్లోనే.. ఓటీటీకి విజ‌య్ అంటోని లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

ABN , Publish Date - Aug 23 , 2024 | 11:16 AM

స‌రిగ్గా 12 రోజుల క్రితం థియేట‌ర్ల‌లో విడుద‌లైన విజ‌య్ అంటోని కొత్త చిత్రం తుఫాన్ చ‌ప్పుడు లేకుండా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మురళీ శర్మ, మేఘా ఆకాష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

toofan

స‌రిగ్గా 12 రోజుల క్రితం థియేట‌ర్ల‌లో విడుద‌లైన విజ‌య్ అంటోని కొత్త చిత్రం తుఫాన్ (Toofan) చ‌ప్పుడు లేకుంగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. శరత్ కుమార్ ( Sarathkumar), సత్యరాజ్(Sathyaraj), డాలీ ధనుంజయ (Daali Dhananjaya), మేఘా ఆకాష్ (Megha Akash), మురళీ శర్మ (Murali Sharma), పృథ్వీ అంబర్ (Pruthvi Ambaar), శరణ్య పొన్వన్నన్ (Saranya Ponvanna), తలైవాసల్ విజయ్ (Thalaivasal Vijay) వంటి మ‌హా హ‌హులు న‌టించిన ఈ చిత్రానికి మిజ‌య్ మిల్ట‌న్ (Vijay Anton) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. తెలుగులో విడుద‌ల‌కు ఓ వారం ముందే త‌మిళంలో రిలీజైన ఈ చిత్రం ఆగ‌స్టు9న మ‌న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ స‌రైన‌ ప్ర‌చారం లభించ‌క‌ ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ ప‌ర్చింది.

Toofan.jpg

క‌థ విష‌యానికి వ‌స్తే.. స‌లీం ఓ సీక్రెట్ ఏజెంట్‌. త‌న బాస్ శ‌ర‌త్ కుమార్ అదేశాల మేర‌కు ఓ ఆప‌రేష‌న్ నిమిత్తం అండ‌మాన్‌కు వెళ‌తాడు. తీరా అత‌ను వెళ్లిన స‌మ‌యానికి ఆ ప్రాంతాన్ని డాలీ శాసిస్తుంటాడు. డ‌బ్బులు వ‌డ్డీకి ఇస్తూ.. తిరిగి చెల్లించని వారిని చంపుతుంటాడు. ఈక్ర‌మంలో క‌థానాయిక తండ్రి కూడా మ‌ర‌ణించ‌డంతో కేసు పెడుతుంది. దీంతో డాలీ ప‌గ బ‌డ‌తాడు. అంతేగాక స‌లీంకు ఆశ్ర‌యం ఇచ్చిన ఓ హోట‌ల్‌పై దాడి చేసి అక్క‌డి వారిని బాగా ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ నేప‌థ్యంలో అప్ప‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న స‌లీం అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డానికి రంగంలోకి దిగుతాడు.


Toofan-Movie.jpg

ఈ క్ర‌మంలో స‌లీం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, డాలీతో ఎలా పోరాటం చేశాడు, స‌త్య‌రాజ్ ఎవ‌రు, స‌లీంను చంపేయాల‌ని సొంత టీం ఎందుకు నిర్ణ‌యం తీసుకుంది అనే క‌థ క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది. గ‌త‌వార‌మే ఈ చిత్రం త‌మిళంలో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ తాజాగా ఈ శుక్ర‌వారం (ఆగ‌స్టు 23) నుంచి చ‌ప్పుడు కాకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అయితే సినిమా రెగ్యుల‌ర్ ఫార్మాట్‌లో ఉన్న‌ట్లు అనిపించ‌డం, ప్ర‌చార లోపం వ‌ళ్ల ఈ సినిమా ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక‌ పోయింది.యాక్ష‌న్ సినిమాలు, ఇష్ట‌ప‌డే వారు, విజ‌య్ అంటోని అభిమానులు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Updated Date - Aug 23 , 2024 | 11:16 AM