Vidya Vasula Aham: ఎవ‌రూ థియేటర్స్‌కి వెళ్ళాల్సిన‌ అవసరం లేదు.. ఓటీటీలో చూసేయండి

ABN , Publish Date - May 15 , 2024 | 05:37 PM

ఎవ‌రూ థియేటర్స్‌కి వెళ్ళాల్సిన‌ అవసరం లేదని ఈసినిమాను ఎంచ‌క్కా ఇంట్లోనే ఫ్యామితీతో క‌లిసి చూసి ఎంజాయ్ చేయంగి అంటూ విద్య‌వాసుల అహం చిత్ర యూనిట్ కోరింది. బుధ‌వారం ట్రైల‌ర్ టాంచ్ ఈవెంట్ నిర్వ‌హించారు ఈ సంద‌ర్భంగా త‌మ అభాప్రాయాల‌ను మీడియాతో పంచుకున్నారు.

Vidya Vasula Aham: ఎవ‌రూ థియేటర్స్‌కి వెళ్ళాల్సిన‌ అవసరం లేదు.. ఓటీటీలో చూసేయండి
vidya vasula aham

రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని (Shivani Rajashekar) జంట‌గా న‌టించిన చిత్రం విద్య వాసుల అహం (Vidya Vasula Aham). ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ (ETERNITY ENTERTAINMENT) బ్యానర్‌పై మహేష్ దత్తా, లక్ష్మి నవ్యలు ఈ చిత్రాన్ని నిర్మించ‌గా, మనికాంత్ గెల్లి (Manikanth Gelli) దర్శకత్వం వహించారు. మే 17న డైరెక్ట్‌గా ఆహ ఓటీటీ రిలీజ్ కాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిని ట్రైట‌ర్ ఫ్యామిలీ అడియెన్స్ నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టింది. ట్రైల‌ర్‌ను చూస్తే.. కొత్త‌గా పెళ్లి చేసుకున్న విద్య‌, వాసుల‌ జంట ఆ త‌ర్వాత త‌మ దైనందిన జీవితంలో వారి అహాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా ఒక‌రిపై ఒక‌రు అన్న‌ట్లుగా ఈగోల‌తో త‌మ కాపురాన్ని లాగిస్తుంటారు. ఈక్ర‌మంలో వారి సంసారంలో, ఫ్యామిలీల‌లో వ‌చ్చే స‌మ‌స్య‌లు, చివరికి ఆ ఈగోస్ నుంచి బయటకి ఎలా వచ్చారనే నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

GNmqJbuXYAAiktA.jpeg

అయితే బుధ‌వారం ఈ చిత్ర యూనిట్ పాత్రికేయ సమహవేశం నిర్వ‌హించి సినిమా గురించి త‌మ అభిప్రాయాల‌ను మీడియా ప్ర‌తినిధుల‌తో పంచుకున్నారు. డైరెక్టర్ మనికాంత్ గెల్లి (Manikanth Gelli) మాట్లాడుతూ.. ఈ సినిమాపూర్తిగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరని అన్నారు. అందరి కన్నా ఎక్కువగా కళ్యాణీ మాలిక్ సపోర్ట్ ఇచ్చారని, అయనే హీరోయిన్ని, విష్ణు మూర్తి రోల్ కి అవసరాల శ్రీనివాస్ ని యనే సజెస్ట్ చేశార‌న్నారు. నా డైరెక్షన్ డిపార్టుమెంటుకి థాంక్స్ అని అన్నారు. ఎవ‌రూ థియేటర్స్ కి వెళ్ళాల్సిన‌ అవసరం లేదని ఆహా ఓటీటీలో తప్పకుండా చూడండని అన్నారు.


హీరో రాహుల్ (Rahul Vijay) మాట్లాడుతూ.. ఇదొక చిన్న క్యూట్ ఈగోస్ ఉండే ఫన్ ఫిలిం అని. సరదాగా హాయిగా సమ్మర్‌లో ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా అని అన్నారు. నాకు వెంకటేష్ గారిలా ఫ్యామిలీ స్టోరీస్ చెయ్యాలని ఉండేద‌ని, ఒక రోజు ఫ్లైట్ లో ఉన్నప్పుడు మనికాంత్ కాల్ చేసి, పీడిఎఫ్ సెండ్ చేస్తే అప్పటికప్పుడు కథ నచ్చి ఒకే చెప్పేశానని.. టైటిల్ చాలా గమ్మత్తుగా అనిపించిందన్నారు.

vidya vasula.jpg

శివాని (Shivani Rajashekar) మాట్లాడుతూ.. గ‌డిచిన రెండు సంవత్సరాల నుంచి ఈ టీంతో అనుబంధం ఉందని ఆహా ఓటీటీ నాకు నిజంగా ఓ లక్కీ ప్లాట్ ఫాం అని పేర్కొంది. ఆల్రెడీ కోట బొమ్మాళి అహాలో వచ్చిందని, ఇప్పుడు విద్య వాసుల అహం (Vidya Vasula Aham) కూడా వస్తుందనన్నారు.ఏ మాత్రం ఈగో లేని వ్యక్తి రాహుల్. అని ఆయ‌న‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా హ్యాపీగా ఉంద‌ని ఈ సినిమాను అంద‌రూ చూసి అశీర్వ‌దించాల‌ని తెలిపింది.

Updated Date - May 15 , 2024 | 05:37 PM